ముంబయి ఎయిర్‌పోర్టులో తృటిలో తప్పిన ప్రమాదం

ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అధికారిపై వేటు

Update: 2024-06-09 10:23 GMT

ముంబయి ఎయిర్‌పోర్టులో తృటిలో తప్పిన ప్రమాదం

ముంబై విమానాశ్రయంలో ఎయిరిండియా విమానానికి తృటిలో ప్రమాదం తప్పింది. రన్‌వేపై నుంచి ఎయిరిండియా విమానం టేకాఫ్ అవుతున్న స‌మ‌యంలో అదే స‌మ‌యానికి ఇండిగో విమానం ల్యాండ్ అయ్యింది. దీంతో టేకాఫ్ అవుతున్న ఎయిరిండియా జెట్ తృటిలో ప్రమాదం నుంచి త‌ప్పించుకుంది.ఇక ఈ ఘటనపై సమగ్ర విచారణకు డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్ ఆదేశించ‌డంతో పాటు డ్యూటీలో ఉన్న ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అధికారిని తొలగించింది. ఇక ఈ రెండు విమానాలు ద‌గ్గరిగా వ‌చ్చిన వీడియో ప్రస్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతుంది.

Tags:    

Similar News