తమిళనాడులో గజరాజుల బీభత్సం.. కోయంబత్తూరులోని గుడలూరు ప్రాంతంలో హంగామా

* ఏనుగుల దాడిలో 50 ఇళ్లు ధ్వంసం, పలువురికి గాయాలు

Update: 2022-12-09 08:17 GMT

కోయంబత్తూరులోని గుడలూరు ప్రాంతంలో హంగామా

Elephants: తమిళనాడులో గజరాజులు బీభత్సం సృష్టించారు. కోయంబత్తూరులోని గుడలూరు ప్రాంతంలో ఏనుగుల గుంపు నానా బీభత్సం సృష్టించాయి. నీలగిరి ఫారెస్ట్ నుంచి జనావాసాల్లోకి వచ్చిన ఏనుగుల గుంపు గ్రామాల్లో స్వైర విహారం చేశాయి. ఏనుగుల గుంపు దాడిలో దాదాపు 50 ఇళ్లు ధ్వంసం అయ్యాయి. ఇళ్ల గోడలు, కిటికీలు, గేట్లు, పైకప్పులు ధ్వంసం కావడంతో గ్రామస్తులు భయంతో పరుగులు తీశారు. ఏనుగుల గుంపు గ్రామంలో స్వైర విహారం చేస్తున్న విషయాన్ని ఫారెస్ట్ అధికారులకు తెలిపారు. దీంతో సమాచారం అందుకున్న ఫారెస్ట్ అధికారులు..ఏనుగుల గుంపును ఫారెస్ట్ ప్రాంతంలోకి మళ్లించారు. గజరాజుల బీభత్సంతో గ్రామస్తులుంతా ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు.

Tags:    

Similar News