మహారాష్ట్రలోని పూణెలో ఘోర ప్రమాదం.. పూణె - బెంగళూరు హైవేపై లారీ బీభత్సం

* ముందున్న వాహనాలను ఢీకొట్టిన లారీ.. ఒకదాకికొకటి ఢీకొట్టుకున్న వాహనాలు.. మొత్తం 48 వాహనాలు ధ్వంసం

Update: 2022-11-21 01:39 GMT

మహారాష్ట్రలోని పూణెలో ఘోర ప్రమాదం

Pune-Bangalore Highway: మహారాష్ట్రలోని పుణెలో ఘోర ప్రమాదం జరిగింది. పుణె- బెంగళూరు హైవేపై ఉన్న ఓ వంతెన వద్ద ఓ ట్యాంకర్‌ బీభత్సం సృష్టించింది. ముందు ఉన్న వాహనాలను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మొత్తం 48 వాహనాలు ధ్వంసమయ్యాయి. సుమారు 30 మంది వరకు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. పుణెలోని నావెల్‌ వంతెనపై ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. ఓ ట్యాంకర్‌ లారీ వేగంగా వెళ్తుండగా బ్రేకులు పని చేయకపోవటంతో ముందు వెళ్తున్న వాహనాలను ఢీకొట్టింది. అందులోని చమురు రోడ్డుపై పడటం వల్ల పలు వాహనాలు పట్టుకోల్పోయి ముందున్న వాహనాలను ఢీకొట్టాయి. మొత్తంగా 48 వాహనాలు ప్రమాదానికి గురయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పుణె మెట్రోపాలిటన్‌ ప్రాంత అభివృద్ధి సంస్థ అధికారులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 

Tags:    

Similar News