Canada: కెనడాలోని భారత విద్యార్థులకు గొప్ప ఉపశమనం
Canada 700మంది విద్యార్ధులపై విధించిన వేటును నిలిపివేసిన కెనడా ప్రభుత్వం
Canada: కెనడాలోని భారత విద్యార్థులకు గొప్ప ఉపశమనం లభించింది. విద్యాభ్యాసం నిమిత్తం కెనడా వచ్చిన భారతీయ విద్యార్ధులు ఫేక్ ఆఫర్ లెటర్లతో వచ్చారని నిర్ధారించి కెనడా బోర్డర్ సర్వీసెస్ ఏజెన్సీ బహిష్కరణ వేటు వేసినా విషయం తెలిసిందే. ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ విక్రంజీత్ సహానీ చొరవతో స్పందించిన CBSA మానవతాదృక్పథంతో స్పందించి బహిష్కరణ ప్రక్రియను నిలిపివేసింది.
ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ విక్రంజీత్ సహానీ, భారత హై కమిషన్ సహాయంతో బహిష్కరణ వేటుకు గురైన విద్యార్థులకు న్యాయం చేయమని కెనడా ప్రభుత్వాన్ని అభ్యర్ధించగా అందుకు సానుకూలంగా స్పందిస్తూ 700 విద్యార్ధులపై వారు విధించిన వేటును నిలిపివేశారు. ఈ మేరకు ప్రపంచ పంజాబీ ఆర్గనైజేషన్ అంతర్జాతీయ అధ్యక్షుడు కూడా అయిన ఎంపీ విక్రంజీత్ సహానీ కెనడా ప్రభుత్వానికి కృతఙ్ఞతలు తెలిపారు.