New Criminal Laws: ఐపీసీ, సీఆర్పీసీ స్థానంలో కొత్త క్రిమినల్ చట్టాలు; జులై 1 నుంచి అమల్లోకి

New Criminal Laws: గత పార్లమెంటు సమావేశాల్లో కొత్త చట్టాలకు ఆమోదం

Update: 2024-02-25 08:15 GMT

New Criminal Laws: ఐపీసీ, సీఆర్పీసీ స్థానంలో కొత్త క్రిమినల్ చట్టాలు; జులై 1 నుంచి అమల్లోకి

New Criminal Laws: బ్రిటీష్ వలస పాలన నాటి క్రిమినల్ చట్టాలకు ఇక కాలం చెల్లింది. వాటి స్థానంలో కొత్త క్రిమినల్ చట్టాలను భారత కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చింది. ఈ కొత్త చట్టాలు జులై 1 నుంచి అమల్లోకి వస్తాయని కేంద్రం ప్రకటించింది. ఈ కొత్త చట్టాల పేర్లు భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్ష, భారతీయ సాక్ష్య. ఇండియన్ పీనల్ కోడ్-1860, కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ (సీఆర్పీసీ)-1973, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్-1872 చట్టాల స్థానంలో కొత్త చట్టాలు అమల్లోకి రానున్నాయి. ఈ మూడు చట్టాలకు పార్లమెంటు ఆమోదం లభించగా, గత డిసెంబరులో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా రాజముద్ర వేశారు. తాజాగా, కొత్త క్రిమినల్ చట్టాల అమలు తేదీపై గెజిట్ విడుదల చేశారు.

Tags:    

Similar News