Nellore kurrallu: వకీల్‌సాబ్ స్పూఫ్‌తో అదరగొట్టిన బృందం
Nellore kurrallu: ఒక సినిమా తీయాలంటే ఆషామాషీ కాదు.
Nellore kurrallu: ఒక సినిమా తీయాలంటే ఆషామాషీ కాదు. అసలు సినిమా వరకు ఎందుకు ఒక షార్ట్ ఫిల్మ్ అంటేనే చాలా ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. భారీ సెట్టింగులు, గ్రాఫిక్స్, సినిమా మేకర్లు, హిరోలు, హీరోయిన్, ఆర్టిస్ట్‌లు, డబ్బింగ్ ఆర్టిస్ట్‌లు, డ్యాన్సర్లు ఇలా చెప్పుకుంటూ పోతే.. చాతాడంత లిస్టే బయటకొస్తుంది. కానీ ఇవేం లేకుండా నలుగురు, ఐదుగురు కలిసి, ఓ మొబైల్ ఫోన్‌లోనే కొన్ని సినిమాల్లోని సీన్స్‌ను కళ్లకు కట్టినట్టు చిత్రీకరిస్తున్నారంటే నమ్ముతారా..? నమ్మకపోతే ఇది చూసేయండి.
చూశారు కదా.. మన నెల్లూరు కుర్రోళ్లను. ఇరగదీశారు కదా. పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ నటించిన వకీల్‌సాబ్ సినిమాలోని ఫైట్‌ను యాజ్‌టీజ్ దించేశారులే. ఇదే కాదు గతంలో మహేష్ సరిలేరు నీకెవ్వరు సినిమాలోని రమణా లోడెత్తాలిరా ఫైట్‌ను ఎలాంటి సెట్టింగులు, క్రేన్లు, గ్రాఫిక్స్ లేకుండా కేవలం ఒక కెమెరా ఫోన్ తో షూట్ చేసి అటు ఇండస్ట్రీ, ఇటు ప్రజలను ఆశ్చర్యపరిచారు. ఇప్పుడు మరోసారి వకీల్‌సాబ్‌తో హౌరా అనిపించారు ఈ కుర్రాళ్లు.
మొత్తానికి థియేటర్లలో వకీల్‌సాబ్‌ను చూసివచ్చినవారు ఈ ఫైట్ సీన్‌ను చూస్తే మళ్లీ ఆ సినిమాను చూస్తున్న అనుభూతిని పొందుతారు. ఒక కెమెరా ఫోన్, చిన్నపాటి సామాగ్రిని ఉపయోగించుకొని.. 7 ఏళ్ల నుంచి 18లోపు వయస్సువారు ఈ వీడియోను అద్భుతంగా చిత్రీకరించారు. ఈ సినిమాలోని రెండు ఫైట్ సీన్లను కలిపి, ఒకే వీడియోలో బంధించారు. కేవలం ఆరు రోజుల్లోనే షూటింగ్, మేకింగ్, ఎడిటింగ్ కంప్లీట్ చేశామని అంటున్నాడు డైరెక్టర్ కిరణ్. షూటింగ్‌లో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా తగిన జాగ్రత్తలు కూడా తీసుకున్నారంట ఈ టీమ్.
ఈ టీమ్‌లోని సభ్యులంతా స్టూడెంట్సే ఇందులో కొందరు స్కూల్‌కు వెళ్లేవారున్నారు. మరికొందరు కాలేజీకి వెళ్లేవారున్నారు. వీరంతా నిరుపేద కుటుంబం వారే. వాళ్ల ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే. అయినా తల్లిదండ్రులు తమ పిల్లలను నటనలో ప్రోత్సహించడం విశేషం. వకీల్‌సాబ్ సినిమా వీడియోలో యాక్ట్ చేసిన తమ పిల్లల నటనను చూసి మురిసిపోతున్నారు. ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
మొత్తానికి నెల్లూరోళ్లు మరోసారి ఇరగదీశారు. ప్రస్తుతం ఈ వకీల్‌సాబ్ స్పూఫ్ నెట్టింట వైరల్ కావడంతో ఎక్కడెక్కడివారో ఈ టీంను ప్రశంసిస్తున్నారు. సినిమా పరిశ్రమ నుంచి కూడా పలువురు డైరెక్టర్‌లు వీళ్లను అభినందించారు.