Jr. NTR Birthday Wishesh to Kalyan Ram: కళ్యాణ్ రామ్ స్పెషల్‌ విషెస్ చెప్పిన ఎన్టీఆర్

Jr. NTR Birthday Wishesh to Kalyan Ram: నందమూరి హీరో కళ్యాణ్ రామ్ ఈ రోజుతో 42 సంవత్సరాలు పూర్తి చేసుకొని 43వ యేట అడుగుపెడుతున్నారు.

Update: 2020-07-05 05:15 GMT
Jr. NTR Birthday Wishesh to Kalyan Ram: కళ్యాణ్ రామ్ స్పెషల్‌ విషెస్ చెప్పిన ఎన్టీఆర్
Jr NTR, Kalyan Ram (file Photo)
  • whatsapp icon

Jr. NTR Birthday Wishesh to Kalyan Ram: నందమూరి హీరో కళ్యాణ్ రామ్ ఈ రోజుతో 42 సంవత్సరాలు పూర్తి చేసుకొని 43వ యేట అడుగుపెడుతున్నారు. కళ్యాణ్ రామ్ జన్మదినం కావడంతో ఆయనకు అభిమానులు, సినీప్రముఖులు నుంచి సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే ఆయన సోదరుడు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ స్పెషల్‌గా విషెస్ చెప్పారు.

కేవలం అనగానే కాకుండా గత కొన్నేళ్లుగా నాకు మిత్రుడిగా, మార్గదర్శకుడిగా, సలహాలు సూచనలిచ్చే గైడ్‌గా మెదులుతున్నావు. హ్యాపీ బర్త్ డే కళ్యాణ్ అన్నా. నిజంగా నువ్వు చాలా గొప్పవాడివి అని పేర్కొంటూ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు ఎన్టీఆర్. ఈ సందేశం చూసి మురిసిపోతూ కళ్యాణ్ రామ్‌కి పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలుపుతున్నారు నందమూరి ఫ్యాన్స్.

నందమూరి నట వారసుడుగా తెలుగు తెరకు పరిచయమైన కళ్యాణ్ రామ్ నటుడిగా నిర్మాతగా తెలుగు చిత్రసీమలో తనదైన మార్క్ వేసుకున్నారు. 1989లో 'బాలగోపాలుడు' సినిమాలో బాలనటుడిగా నటించి సినీ రంగ ప్రవేశం చేసిన ఆయన.. 2003లో 'తొలిచూపులోనే' సినిమాతో హీరోగా ప్రేక్షకుల ముందుకొచ్చారు. అదే ఏడాది 'అభిమన్యు' సినిమా చేసి తన టాలెంట్ బయటపెట్టారు. ఆ తర్వాత చేసిన ''అతనొక్కడే, లక్ష్మి కళ్యాణం, పటాస్'' సినిమాలు ఆయన కెరీర్‌ని మలుపుతిప్పాయి. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ స్థాపించి నిర్మాతగానూ మారారు. ఎన్టీఆర్ 'జై లవకుశ' , రవితేజ హీరోగా కిక్ 2 చిత్రాలు నిర్మించారు.



Tags:    

Similar News