
Tamannaah: మిల్కీ బ్యూటీ తమన్నా ఓదెల 2 సినిమాతో నటిగా తనలోని కొత్త కోణాన్ని ప్రేక్షకులకు చూపించేందుకు రెడీ అయ్యారు. శివశక్తిగా ఆమె నటించిన ఈ మూవీ ఈనెల 17న విడుదల కానుంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్ లో బిగా ఉన్న తమన్నాను ఓ ప్రశ్న ఎదురైంది. పెళ్లి ఎప్పుడు చేసుకోబోతున్నారు అని ఓ ఇంటర్వ్యూలో అడిగారు. ప్రస్తుతానికి ఆ ఆలోచన లేదని తెలిపింది. కొంతకాలంగా ప్రేమలో ఉన్న నటుడు విజయ్ వర్మ..తమన్నాకు బ్రేకప్ అయిందంటూ బాలీవుడ్ లో ఇటీవల వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.
ఆఫర్లు లేకపోవడంతో చిన్న సినిమాల్లో నటిస్తున్నారా అని అడిగిన ప్రశ్నకు తమన్నా స్పందించారు. నా ద్రుష్టిలో చిన్న సినిమా, పెద్ద సినిమా అని ఉండదు. కంటెంట్ బాగుంటే పెద్ద సినిమా అవుతుంది. బాగలేకపోతే చిన్న సినిమా అవుతుంది. కెరీర్ ప్రారంభంలో నేను నటించిన హ్యాపీడేస్ మూవీలో 8 ప్రధాన పాత్రల్లో నేనొక్కదాన్ిన..నాకు డ్యాన్స్ ఇష్టం కాబట్టి బాలీవుడ్ మూవీ స్త్రీ 2లో ప్రత్యేక పాటలో నటించారు. కానీ అది పెద్ద హిట్ అవుతుందని నేను ఊహించలేదు. ఏది ప్రేక్షకులను ఆకట్టుకుంటుందనేది మనం చెప్పలేము అని అన్నారు. ఓదెల సినిమాకి సీక్వెల్ గా రూపొందించే ఓదెల 2. దుష్టశక్తుల నుంచి ఓదెల గ్రామాన్ని మల్లన్నస్వామి ఎలా రక్షించారు..శివశక్తి ఏం చేసిందన్న అంశాలతో దర్శకుడు అశోక్ తేజ ఈ మూవీని తెరకెక్కించారు.