Tollywood: ఒక్క సినిమాతో ట్రెండింగ్.. కుర్రాళ్లు తెగ వెతికేస్తున్న ఈ బ్యూటీ ఎవరంటే..?
Tollywood: సినిమా ఇండస్ట్రీ అంటేనే అద్భుతాలకు నెలవు. ఎప్పుడు, ఎవరు, ఎలా వార్తల్లో నిలుస్తారో తెలియదు. స్టార్ డమ్ వచ్చేందుకు పదుల కొద్దీ సినిమాలు చేయాల్సిన పనిలేదు.

Tollywood: ఒక్క సినిమాతో ట్రెండింగ్.. కుర్రాళ్లు తెగ వెతికేస్తున్న ఈ బ్యూటీ ఎవరంటే..?
Tollywood: సినిమా ఇండస్ట్రీ అంటేనే అద్భుతాలకు నెలవు. ఎప్పుడు, ఎవరు, ఎలా వార్తల్లో నిలుస్తారో తెలియదు. స్టార్ డమ్ వచ్చేందుకు పదుల కొద్దీ సినిమాలు చేయాల్సిన పనిలేదు. సరిగ్గా ఒక్క సీన్ సీన్ ఉన్నా చాలు. అలాంటి వారు ఎంతో మంది సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు. ఈ జాబితాలోకే వస్తుంది, పైన ఫొటోలో కనిపిస్తున్న బ్యూటీ. ఇంతకీ ఈ చిన్నది ఎవరో గుర్తుపట్టారా.?
హీరోయిన్ పాత్రలో కాకపోయినా.. చిన్న సహాయ పాత్రలో కనిపించిన ఈ అమ్మడు, ఇప్పుడు సోషల్ మీడియాలో స్టార్ లా దూసుకుపోతుంది. నటించిన సినిమా పెద్ద హిట్ కావడం.. అందులో ఆమె పర్ఫార్మెన్స్ హైలైట్ అవడంతో ఒక్కసారిగా కుర్రాళ్ల మనసుల్లో స్థానం సంపాదించుకుంది. ఇప్పుడు అందరూ గూగుల్‌లో ఆమె పేరు సెర్చ్ చేస్తూ తెగ వెతుకుతున్నారు.
ఈ బ్యూటీ మరెవరో కాదు లతా రెడ్డి. పేరు చెబితే గుర్తు పట్టకపోవచ్చు కానీ దేవర సినిమా చెబితో మాత్రం ఇట్టే గుర్తొస్తుంది. దేవర సినిమాతో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చిన లతా, ఆ తర్వాత మరికొన్ని సినిమాల్లో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. అంతే కాదు.. సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటూ తన ఫోటోలతో నెటిజన్‌లను ఫిదా చేస్తోంది. ఇటీవల ఆమె పోస్ట్ చేసిన కొన్ని గ్లామర్ ఫోటోలు కుర్రాళ్ల హార్ట్‌బీట్ మిస్ అయ్యేలా చేస్తున్నాయి!
ఇప్పుడు లతా రెడ్డి పేరు ఒక్కసారి వింటే గుర్తుపట్టకపోయినా.. ఫోటో చూస్తే మాత్రం ఠక్కున గుర్తొస్తుంది. ఈ అమ్మడు గ్లామర్‌కి కూడా ఏమాత్రం తగ్గట్లేదు. చిన్న పాత్ర చేసినా పెద్ద పాపులారిటీ సంపాదించగలిగిన ఈ బ్యూటీ.. త్వరలోనే హీరోయిన్‌గా కనిపిస్తే ఆశ్చర్యం లేదు. మరి ఈ బ్యూటీ మరెన్ని వండర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.