Terror Attack: కశ్మీర్ అటాఖక్‌పై రేణు సంచలన వ్యాఖ్యలు.. సెక్యులర్ వాదులు ఎక్కడ అంటూ
Terror Attack: కశ్మీర్‌లోని పహల్గాం వద్ద జరిగిన ఉగ్రదాడి దేశవ్యాప్తంగా తీవ్ర ఆవేదన కలిగిస్తోన్న విషయం తెలిసిందే.

Terror Attack: కశ్మీర్ అటాఖక్‌పై రేణు సంచలన వ్యాఖ్యలు.. సెక్యులర్ వాదులు ఎక్కడ అంటూ
Terror Attack: కశ్మీర్‌లోని పహల్గాం వద్ద జరిగిన ఉగ్రదాడి దేశవ్యాప్తంగా తీవ్ర ఆవేదన కలిగిస్తోన్న విషయం తెలిసిందే. ఉగ్రవాదులు పర్యాటకులను హత్య చేసే ముందు మతం గురించి అడిగి చంపారని ప్రత్యక్ష సాక్ష్యులు చెబుతున్నారు. ఇప్పుడు ఇదే అంశం తీవ్ర చర్చకు దారి తీసింది. ఈ ఉగ్రదాడిలో మొత్తం 26 మంది హిందువులే మరణించడం సరికొత్త ప్రశ్నలకు తెరలేపింది. ఈ క్రమంలోనే ఈ విషయంపై పలువు సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా ప్రశ్నలు సంధిస్తున్నారు.
ఈ విషయంపై నటి రేణూ దేశాయ్ ఈ ఘటనపై తీవ్రంగా స్పందించారు. మతం అడిగి మరీ కాల్చారు. ఇది టెర్రరిజానికి మతం లేదన్న సిద్ధాంతాన్ని ఎదుర్కొంటుందని పేర్కొన్నారు. "కులం కాదు.. ప్రాంతం కాదు.. రంగు కాదు.. మతాన్ని అడిగి కాల్చారు. మరి ఇప్పుడు 'సెక్యులర్' వాదులు ఎక్కడ?" అంటూ ప్రశ్నించారు.
అలాగే, పాపులర్ యాంకర్ సుమ కూడా ఈ ఘటనపై దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. "జమ్మూ కాశ్మీర్ అంటే మనకు మినీ స్విట్జర్లాండ్ గుర్తుకొస్తుంది. అలాంటి అందమైన ప్రదేశంలో పహల్గాం లాంటి చోట ఇలా జరగడం ఎంతో బాధాకరం. ఈ వార్తలు వింటే గుండె బద్దలవుతున్నట్లు ఉంది. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని, మరణించిన వారి కుటుంబాలకు దేవుడు బలం ఇవ్వాలని కోరుకుంటున్నాను" అంటూ ట్వీట్ చేశారు.
ఇక హీరోయిన్లు రష్మిక మందన్నా, ఈషా రెబ్బా, కీర్తి సురేష్ లాంటి వారు కూడా ఈ ఘటనపై స్పందించారు. ఈ సంఘటన హృదయాన్ని ముక్కలు చేసిందని భావోద్వేగంతో స్పందించారు. ఇప్పటికే రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ ఈ విషయంపై స్పందించగా, చిరంజీవి, అల్లు అర్జున్, మహేష్ బాబు, విజయ్ దేవరకొండ, సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్, నిఖిల్, బాబీ, ప్రియదర్శి వంటి పలువురు టాలీవుడ్ సెలబ్రిటీలు తమ స్పందన తెలిపారు.
ఈ ఉగ్రదాడిలో దాదాపు 26 మంది మరణించగా, పలువురు గాయపడ్డారు. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పర్యాటకులు ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయినట్టు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇవి చూసిన దేశ ప్రజలు ఎమోషన్‌కు గురవుతున్నారు.