
Mahesh Babu
ED: ప్రముఖ సినీనటుడు మహేశ్ బాబుకు ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈనెల 27న విచారణకు హాజరవ్వాలని అందులో పేర్కొంది. సాయిసూర్య డెవలపర్స్, సురానా ప్రాజెక్టు కేసుల్లో ఈడీ ఆయనకు నోటీసులు జారీ చేసింది. ఆ రెండు సంస్థలకు మహేశ్ బాబు ప్రచారకర్తగా ఉన్నారు. పెట్టుబడులు పెట్టేందుకు ఆయన ఇన్ ఫ్లుయెన్స్ చేశారనే అభియోగంపై ఈడీ నోటీసులు జారీ చేసింది. మహేశ్ బాబుకు ఆయా సంస్థలు చెల్లించిన పారితోషికంపై ఆరా తీయనుంది.