Actress: బన్నీలో నటించిన ఈ చిన్నది ఇప్పుడెలా ఉందో తెలుసా.?
టాలీవుడ్, మాటకొస్తే పాన్ ఇండియా స్థాయిలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.

Actress: బన్నీలో నటించిన ఈ చిన్నది ఇప్పుడెలా ఉందో తెలుసా.?
టాలీవుడ్, మాటకొస్తే పాన్ ఇండియా స్థాయిలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. సినీ నేపథ్యం అండగా ఉన్న తన నటనతో తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్నారు. ఇక "బన్నీ" సినిమాతో ఆయనకు ‘బన్నీ’ అనే ముద్దుపేరు స్థిరమైంది. కెరీర్ ప్రారంభంలో వచ్చిన ఈ చిత్రం ఆయనకు మంచి గుర్తింపును తీసుకొచ్చింది.
వి.వి. వినాయక్ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో అల్లు అర్జున్ స్టైల్, యాక్షన్, డాన్స్‌లకు ప్రేక్షకుల నుంచి భారీ స్పందన వచ్చింది. దేవి శ్రీ ప్రసాద్ అందించిన సంగీతం కూడా సినిమాకు అదనపు బలంగా నిలిచింది. ఈ చిత్రంలోని పాటలు ఇప్పటికీ ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నాయి.

ఈ సినిమాలో బన్నీ జోడీగా నటించిన గౌరీ ముంజాల్ కూడా అప్పట్లో మంచి గుర్తింపు పొందింది. తన అందంతో, హావభావాలతో యువతను ఆకట్టుకుంది. గౌరీ తెలుగు, తమిళ, కన్నడ సినిమాలతో పాటు ఒక మలయాళ చిత్రంలో కూడా నటించింది. తెలుగులో ‘శ్రీకృష్ణ 2006’, ‘గోపీ – గోడ మీద పిల్లి’, ‘భూకైలాస్’, ‘బంగారు బాబు’ వంటి సినిమాల్లో కనిపించింది. 'బంగారు బాబు' సినిమా ఆమెకు చివరిది. 2011 తర్వాత గౌరీ ముంజాల్ సినిమాలకు దూరమైంది.
ఇటీవల ఆమె తాజా ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పూర్తిగా మారిపోయిన గౌరీను చూసి కొందరు ఆశ్చర్యపోతున్నారు. అయితే ఆమె గ్లామర్ మాత్రం ఇప్పటికీ అలాగే కొనసాగుతుందనే కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. ప్రస్తుతం ఆమె వయసు 39 సంవత్సరాలు. ఢిల్లీలో నివసిస్తున్న గౌరీకు ఇంకా పెళ్లి కాలేదని సమాచారం.
గతం నుంచి ఇప్పటి వరకు గౌరీ ముంజాల్ ప్రయాణం సినీ ప్రేమికులను ఆకట్టుకుంటోంది.