Prabhas: ప్రభాస్‌కు తల్లిగా పుడితే బాగుండు.. వచ్చే జన్మలో నా కోరిక అదే.. సీనియర్‌ నటి ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్

Update: 2025-04-22 10:39 GMT
Prabhas: ప్రభాస్‌కు తల్లిగా పుడితే బాగుండు.. వచ్చే జన్మలో నా కోరిక అదే.. సీనియర్‌ నటి ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్
  • whatsapp icon

Prabhas: ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్న సినిమా ది రాజా సాబ్. ఈ మూవీలో ప్రభాస్, సీనియర్ నటి జరీనా వహాబ్ తల్లీకొడుకులలుగా నటిస్తున్నారు. ఈ నేపథ్యంలో జరీనా వహాబ్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. ప్రభాస్ పై తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు. దీంతో ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ప్రభాస్ వ్రుత్తి నైపుణ్యాన్ని పొగుడుతూ సెట్ లో ఆయన ఉండే తీరును ప్రశంసించారు జరీనా. ప్రభాస్ లాంటి వారు ఎవరూ ఉండరు. అతను చాలా మంచివాడు అంటూ ఆమె క్రేజీ కామెంట్స్ చేశారు.

నేను దేవుడిని ప్రార్థిస్తున్నాను..నా తర్వాత జన్మలో ఇద్దరు కొడుకులు కావాలి. అందులో ఒకరు సూరజ్ అయితే మరొకరు ప్రభాస్ అయి అండాలి అంటూ రెబల్ స్టార్ ఫ్యాన్స్ మనసు దోచుకుంది. ప్రభాస్ చాలా అందమైన వ్యక్తి మాత్రమే కాదు..ప్రభాస్ మనసు వెన్న అని చెప్పింది. జరీనా వహాబ్ కు ప్రస్తుతం సూరజ్ పంచోలి అనే కొడుకు ఉన్నాడు. అతను కూడా బాలీవుడ్ హీరో. అయితే ఇప్పుడు తనకు మరోజన్మ ఉంటే ఆ జన్మలో సూరజ్ తోపాటు ప్రభాస్ కూడా కొడుకు గా కావాలని ఆమె కోరుకోవడం విశేషం. స

షూటింగ్ పూర్తయి షూటింగ్ చేసే సన్నివేశం లేనప్పుడు కూడా ప్రభాస్ సెట్ లో ఉండటానికి ఇష్టపడతారని జరీనా తెలిపారు. బ్రేక్ సమయంలో కూడా వానిటి వ్యాన్ వద్దకు వెళ్లరని..సెట్ లోనే చుట్టూ తిరుగుతూ తోటి నటులతో సరదాగా ఉంటారని చెప్పుకొచ్చారు. వినయపూర్వకమైన స్వభావం ప్రభాస్ సొంతమని జరీనా తెలిపింది.

జరీనా ప్రభాస్ ను డార్లింగ్ అని పిలుస్తూ..సెట్ లో ఎవ్వరికైనా ఆకలిగా ఉంటే..అతను ఇంటికి ఫోన్ చేసి దాదాపు 40-50 మంది సభ్యులకు ఆహారం తెప్పిస్తాడు. సెట్లోనూ అందరికీ అతనే స్వయంగా వడ్డిస్తాడు. ప్రభాస్ భోజనప్రియుడు అంటూ జరీనా చెప్పుకొచ్చారు.

Tags:    

Similar News