OTT: గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే, అదిరిపోయే ట్విస్టులు.. ఈ 7 సినిమాలను అస్సలు మిస్ అవ్వకండి

OTT: ఓటీటీలు అందుబాటులోకి వచ్చిన తర్వాత ఆడియన్స్ అభిరుచులు సైతం మారిపోతున్నాయి. కంటెంట్ ఉన్న సినిమాలకు ప్రజలు జై కొడుతున్నారు.

Update: 2025-04-23 11:00 GMT
OTT

OTT: గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే, అదిరిపోయే ట్విస్టులు.. ఈ 7 సినిమాలను అస్సలు మిస్ అవ్వకండి

  • whatsapp icon

OTT: ఓటీటీలు అందుబాటులోకి వచ్చిన తర్వాత ఆడియన్స్ అభిరుచులు సైతం మారిపోతున్నాయి. కంటెంట్ ఉన్న సినిమాలకు ప్రజలు జై కొడుతున్నారు. ఓటీటీలు ఇందుకు కేరాఫ్ అడ్రస్ గా మారుతున్నాయి. భాషతో సంబంధం లేకుండా రకరకాల ఇండస్ట్రీలకు చెందిన సినిమాలు సినీ లవర్స్ ను ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా థ్రిల్లర్ కథాంశాలతో వచ్చిన సినిమాలకు ఓటీటీలో భారీగా ఆదరణ లభిస్తోంది. మరి ప్రస్తుతం ఓటీటీలో అందుబాటులో ఉన్న ఇలాంటి టాప్ 7 సినిమాలు, అవి ఎందులో స్ట్రీమింగ్ అవుతున్నాయి.? లాంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

మంజుమ్మెల్ బాయ్స్

జియో హాట్‌స్టార్‌ ప్లాట్‌ఫామ్‌ లో అందుబాటులో ఉన్న ఈ చిత్రాన్ని నిజ జీవిత సంఘటనల ఆధారంగా రూపొందించారు. కొద్దిమంది స్నేహితులు విహారయాత్ర కోసం కొడైకెనాల్‌కి వెళ్లిన సమయంలో, వారిలో ఒకరు ప్రమాదకరమైన గుహలో పడిపోతారు. మిగిలిన స్నేహితులు అతన్ని రక్షించేందుకు చేసిన ప్రయత్నం, వారి మధ్య ఉన్న స్నేహబంధం, ఎమోషనల్ ఇన్వాల్వ్మెంట్ సినిమాకు హైలైట్‌గా నిలుస్తాయి. చివరి వరకు ఉత్కంఠ రేపే థ్రిల్లర్ ఇది.

తేరి (Theri)

అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్‌లో అవుతోన్న ఈ సినిమాలో విజయ్ ఓ ఓ పోలీస్ అధికారి పాత్రలో కనిపిస్తారు. తన కూతురి కోసం శక్తివంచన లేకుండా పోరాడే తండ్రిగా ఆయన నటన విశేషంగా ఆకట్టుకుంటుంది. పాత జీవితాన్ని మర్చిపోయి కొత్త జీవితం మొదలుపెట్టిన అతను, మరోసారి తాను ఎవరన్న విషయాన్ని బయటపెట్టాల్సి వస్తుంది. యాక్షన్, భావోద్వేగాలు, కుటుంబ బంధాలు మిళితమైన కమర్షియల్ ఎంటర్టైనర్ ఇది.

రాట్సాసన్ (Ratsasan)

జియో హాట్‌స్టార్‌లో అందుబాటులో ఉన్న ఈ సినిమా, తెలుగు ప్రేక్షకులకు 'రాక్షసుడు'గా సుపరిచితమైంది. సినిమా దర్శకుడిగా కెరీర్‌ ప్రారంభించాలనుకునే వ్యక్తి అనుకోకుండా పోలీసు అవుతాడు. ఇదే తరుణంలో బాలికలపై దాడులు చేసే సీరియల్ కిల్లర్ కేసు తీసుకోవాల్సి వస్తుంది. ఈ క్రమంలో అమలా పాల్ తో కలిసి, సీరియల్ కిల్లర్‌ను పట్టుకోవడం ఈ సినిమా కథ.

దృశ్యం (Drishyam)

ఈ మలయాళ క్లాసిక్ మూవీ జియో హాట్‌స్టార్ లో అందుబాటులో ఉంది. మోహన్‌లాల్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం, ఓ సామాన్య కుటుంబ తండ్రి తన కుటుంబాన్ని రక్షించేందుకు ఎలా వ్యవహరిస్తాడన్నదే కధాంశం. అద్భుతమైన స్క్రీన్‌ప్లే, మానవ సంబంధాలు ఇందులో చూపించారు. ప్రతి క్షణం ఉత్కంఠ భరితంగా ఉంటుంది. ఈ సినిమా తెలుగులో వెంకటేష్, మీనా ప్రధాన పాత్రలో తెరకెక్కింది.

సూక్ష్మదర్శిని (Sookshmadarshini)

జియో హాట్‌స్టార్‌ లో ప్రసారం అవుతున్న ఈ చిత్రంలో నజ్రియా, జోసెఫ్ ముఖ్యపాత్రలు పోషించారు. కథలో మాన్యుయేల్ అనే వ్యక్తి తన తల్లి జీవించిన ప్రాంతానికి తిరిగి వస్తాడు. అతని ప్రవర్తన పక్కింటి అమ్మాయి ప్రియదర్శినికి అనుమానంగా అనిపిస్తుంది. దీంతో ఆమె అసలేం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం మొదలు పెడుతుంది. ఈ క్రమంలో బయటపడే రహస్యాలు కథను కొత్త మలుపు తిప్పుతాయి. మిస్టరీ, థ్రిల్, అనుమానాలతో ప్రతీ సన్నివేశం ఉత్కంఠ భరింతగా ఉంటుంది.

ఇరట్ట (Iratta)

నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉన్న ఈ చిత్రంలో జోజు జార్జ్ ద్విపాత్రాభినయం చేశారు. కవల సోదరుల పాత్రల్లో ఆయన నటన ప్రధాన ఆకర్షణ. ఒకరు కఠిన మనస్కుడైన పోలీస్ అధికారి కాగా, మరొకరు మామూలు పోలీస్. ఒకరి అనూహ్య మరణం చుట్టూ కథ తిరుగుతుంది. మరణానికి వెనక ఉన్న రహస్యాలను అతని అన్న శోధిస్తాడు. సస్పెన్స్, ఎమోషన్లతో కూడిన ఈ సినిమా ఆకట్టుకుంటుంది.

విక్రమ్ వేద (Vikram Vedha)

అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఉన్న ఈ చిత్రంలో ఆర్ మాధవన్ పోలీస్ ఆఫీసర్‌గా, విజయ్ సేతుపతి గ్యాంగ్ లీడర్‌గా నటించారు. వాస్తవం, నైతికతల మధ్య యుద్ధంలా నడిచే కథ ఇది. ప్రతిసారి వేద చెప్పే కథలు, విక్రమ్ మనసులో ప్రశ్నలు రేపుతాయి. కథలో ట్విస్టులు, మలుపులు, ఫిలాసఫికల్ అంశాలు ఆకట్టుకుంటాయి.

Tags:    

Similar News