Samantha: సమంత పెళ్లి ఫిక్స్ అయినట్లేనా.? 12 ఏళ్ల తర్వాత ఆ ఆలయంలో పూజలు అందుకేనా..
Samantha: నాగచైతన్య, శోభిత వివాహం తర్వాత అందరి దృష్టి సమంతపై పడిందన్న విషయం తెలిసిందే.

Samantha: సమంత పెళ్లి ఫిక్స్ అయినట్లేనా.? 12 ఏళ్ల తర్వాత ఆ ఆలయంలో పూజలు అందుకేనా..
Samantha: నాగచైతన్య, శోభిత వివాహం తర్వాత అందరి దృష్టి సమంతపై పడిందన్న విషయం తెలిసిందే. చైతన్య రెండో పెళ్లి చేసుకొని హ్యాపీగా సెటిల్ అయ్యాడు. మరి సమంత పరిస్థితి ఏంటి.? అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది.
2017లో ప్రేమించి పెళ్లి చేసుకున్న నాగచైతన్య–సమంతలు, నాలుగేళ్లలోనే విడిపోయిన విషయం తెలిసిందే. 2021లో విడాకులు తీసుకుని అందరిని ఆశ్చర్యపరిచారు. ఈ విడాకులకు గల అసలు కారణం ఏమిటన్నది ఎవరికీ తెలియలేదు. విడాకుల అనంతరం డిప్రెషన్‌కు లోనైన సమంత మళ్లీ సినిమాల ద్వారా బిజీ అయ్యారు. ఈ సమయంలో మయోసైటిస్ అనే అరుదైన వ్యాధిని ఎదుర్కొన్నారు. ఎంతో పట్టుదలతో దాన్ని జయించి మళ్లీ సినిమాలకు తిరిగి వచ్చారు. ఫ్యామిలీ మెన్ సిరీస్‌తో పాటు, అంతర్జాతీయ ప్రాజెక్ట్ సిటాడెల్ ద్వారా కూడా తన స్థాయిని నిరూపించుకున్నారు. ఈ మధ్య ఓ సంస్థ నిర్వహించిన సర్వేలో భారత్‌లో అత్యధిక క్రేజ్ ఉన్న హీరోయిన్‌గా నిలిచారు.
ఇప్పుడిప్పుడే నిర్మాతగా మారేందుకు సమంత అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలో ఆమె రెండో పెళ్లి గురించి వార్తలు మళ్లీ చర్చకు వస్తున్నాయి. తాజాగా ఆమె సిటాడెల్ దర్శకుడు రాజ్ నిడిమోరుతో రిలేషన్‌లో ఉన్నారన్న వార్తలు వెలుగుచూశాయి. త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని కూడా టాక్. రాజ్ నిడిమోరు తెలుగువారు కావడంతో, "సమంత మళ్లీ తెలుగింటి కోడలవుతుందా?" అనే చర్చ నెట్టింట్లో ట్రెండ్ అవుతోంది.
ఈ వార్తలపై ఇద్దరూ ఇప్పటివరకు స్పందించలేదు. అంతేకాదు, వాలెంటైన్స్ డే సందర్భంగా సమంత పోస్ట్ చేసిన ఫోటో, పలు ఈవెంట్స్‌కు రాజ్‌తో కలిసి హాజరవడం ఈ గాసిప్స్‌కు మరింత బలం చేకూర్చాయి. అయితే రాజ్ నిడిమోరుకు ఇప్పటికే ఒక వివాహం ఉన్నట్లు, ఆ వ్యవహారం క్లియర్ కాకపోవడం వల్లే సమంతతో పెళ్లి ఆలస్యమవుతోందన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి.
ఇంతలో శనివారం సమంత తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం, అనంతరం శ్రీకాళహస్తికి వెళ్లి ప్రత్యేక పూజలు చేయడం మరోసారి హాట్ టాపిక్ అయింది. 12 ఏళ్ల క్రితం స్టార్ హీరో సిద్ధార్థ్‌తో రిలేషన్‌లో ఉన్న సమయంలో సమంత ఇదే ఆలయంలో రాహు కేతు పూజలు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు రాజ్ నిడిమోరుతో పెళ్లికి ముందే ఇలాంటి పూజలు చేయడం గమనార్హం.
ఈ పూజలు నిజంగా రాజ్‌తో పెళ్లికి సంబంధమా? లేక ఇతర ఆధ్యాత్మిక విషయాలకా? అనే చర్చలు నడుస్తున్నా, అధికారిక ప్రకటన వెలువడే వరకు ఏదైనా ఖచ్చితంగా చెప్పడం కష్టమే. మరి సమంత రెండో ఇన్నింగ్స్‌పై స్పష్టత రావాలంటే కొంత కాలం ఆగాల్సిందే.