OTT Movie: బయటకు హెయిర్ స్టైలిస్ట్ లోపల మాత్రం సైకో కిల్లర్.. ఓటీటీలో భయపెట్టే సినిమా..!
OTT Movie: ఇప్పటి ప్రేక్షకులు కొత్తకథలపై ఆసక్తి చూపుతుండటంతో, దర్శకులు కూడా వినూత్నమైన కంటెంట్‌ను తీసుకొస్తున్నారు.

OTT Movie: బయటకు హెయిర్ స్టైలిస్ట్ లోపల మాత్రం సైకో కిల్లర్.. ఓటీటీలో భయపెట్టే సినిమా..!
OTT Movie: ఇప్పటి ప్రేక్షకులు కొత్తకథలపై ఆసక్తి చూపుతుండటంతో, దర్శకులు కూడా వినూత్నమైన కంటెంట్‌ను తీసుకొస్తున్నారు. ముఖ్యంగా హారర్ నేపథ్యంతో రూపొందిన సినిమాలకైతే, మరింత ఆదరణ లభిస్తోంది. అలాంటి కథే ఆధారంగా తెరకెక్కిన హారర్ థ్రిల్లర్ 'ది స్టైలిస్ట్' గురించి తెలుసుకుందాం.
ఈ సినిమా కథా నిర్మాణం ఓ మానసిక సమస్యలతో బాధపడే యువతిని చుట్టుముట్టి సాగుతుంది. సైకో ఎలిమెంట్స్, లోతైన మానసిక భయాల మేళవింపుతో ఈ చిత్రం రూపొందింది. 2020లో విడుదలైన ఈ అమెరికన్ హారర్ డ్రామా చిత్రానికి రచన, దర్శకత్వం, నిర్మాణం అందించినవారు జిల్ గెవర్గిజియన్. ఈ సినిమా, ఆమె 2016లో రూపొందించిన అదే పేరుతో ఉన్న షార్ట్ ఫిల్మ్‌ను ఆధారంగా తీసుకొని రూపొందించబడింది. నజర్రా టౌన్‌సెండ్, బ్రియా గ్రాంట్ ప్రధాన పాత్రల్లో నటించారు.
కథేంటంటే.?
క్లైర్ అనే యువతి ఒక హెయిర్ స్టైలిస్ట్‌గా పనిచేస్తుంటుంది. వెలుపల చూస్తే సాధారణంగా కనిపించే ఆమెకు, లోపల మాత్రం ఓ భయంకరమైన కోణం దాగి ఉంటుంది. క్లైర్ తన కస్టమర్లను రహస్యంగా హత్య చేసి, వారి తలల నుంచి స్కాల్ప్‌లను తీసి తన ఇంటి సెల్లార్‌లో భద్రంగా ఉంచుతూ ఉంటుంది. ఈ స్కాల్ప్‌లను ధరిస్తూ ఆమె, ఇతరుల జీవితాలను అనుభవించాలనే కోరికతో జీవిస్తుంది.
ఒక సందర్భంలో, ఆమె రెగ్యులర్ క్లయింట్ అయిన ఒలివియా, పెళ్లి రోజు హెయిర్ స్టైలింగ్ చేయమని అడుగుతుంది. ఒలివియా లైఫ స్టైల్ పట్ల క్లైర్ ఆకర్షితమవుతుంది. ఆమెతో సమయం గడపడానికి ప్రయత్నించినప్పటికీ, కొందరి అవమానాలకు గురవుతుంది. ఇవి క్లైర్ మానసిక స్థితిని మరింత దిగజార్చుతాయి.
చివరకు తన కోరికలపై కంట్రోల్ కోల్పోతుంది. ఒలివియాను హత్య చేసి, ఆమె స్కాల్ప్, దుస్తులు ధరించి.. పెళ్లి వేదికపై ఒలివియాగా నటిస్తూ నడుస్తుంది. కాని వరుడు ముసుగు తొలగించిన తర్వాత, అసలు విషయం బయట పడుతుంది. అతిథులంతా భయంతో పరుగులు తీస్తారు. క్లైర్ చివరికి మారుతుందా? తన పాత భయంకర స్వభావాన్ని మానుకుంటుందా? లేక మానసిక రుగ్మతలు మరింత ఎక్కువవుతాయా.? అన్న విషయాలు తెలియాంటే సినిమా చూడాల్సిందే.