విష్ణు విశాల్, జ్వాలా గుత్తాలకు పెళ్లి రోజే గుడ్ న్యూస్.. పండంటి బిడ్డకు జన్మనిచ్చిన సెలబ్రిటి కపుల్

Vishnu Vishal and Jwala Gutta family: విష్ణు విశాల్, జ్వాలా గుత్తా దంపతులకు వారి 4వ పెళ్లి రోజు నాడే బిడ్డ పుట్టింది.

Update: 2025-04-22 12:18 GMT
Vishnu Vishal and Jwala Gutta couple blessed with baby girl on their 4th wedding anniversary

Vishnu Vishal and Jwala Gutta couple: విష్ణు విశాల్, జ్వాలా గుత్తాల పెళ్లి రోజే ఎగ్జైటింగ్ న్యూస్.. పండంటి బిడ్డకు జన్మనిచ్చిన సెలబ్రిటి కపుల్

  • whatsapp icon

Vishnu Vishal and Jwala Gutta News: విష్ణు విశాల్, జ్వాలా గుత్తా దంపతులకు పండంటి బిడ్డ పుట్టింది. అది కూడా వారి 4వ పెళ్లి రోజు నాడే ( ఏప్రిల్ 22 ) బిడ్డ పుట్టడం ఆ దంపతులను, ఇరు కుటుంబాలను మరింత ఆనందంలో ముంచెత్తుతోంది. ఇదే విషయాన్ని విష్ణు విశాల్ ఎక్స్ ద్వారా తమ అభిమానులతో పంచుకున్నారు.

తమ కుమారుడు ఆర్యన్ ఇప్పుడు అన్నయ్య అయ్యాడు అంటూ విష్ణు విశాల్ ఆ పోస్టులో పేర్కొన్నాడు. పాప ముఖాన్ని చూపించకుండా ఆ పసి కందు చేతిని, కొడుకు ఆర్యన్ ముఖంలో ఆనందాన్ని చూపిస్తూ రెండు వేర్వేరు ఫోటోలు షేర్ చేశాడు. తమ బిడ్డను ఆశీర్వదించండి అని కోరుతూ విష్ణు విశాల్ చేసిన ఈ పోస్టుపై అభిమానులు స్పందిస్తున్నారు.


తమిళ సినిమాల్లో రాణిస్తున్న విష్ణు విశాల్, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. 

Tags:    

Similar News