టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు @41 ఇయర్స్!
దీనితో మహేష్ బాబు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి 41 ఏళ్లు అవుతుంది అన్నమాట. ఈ చిత్రంలో మహేష్ అన్నయ్య రమేష్ బాబు హీరోగా నటించారు. ఇది ఆయనకు రెండవ చిత్రం కావడం విశేషం.
సూపర్ స్టార్ కృష్ణ నట వారసత్వంతో బాలనటుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు మహేష్ బాబు. అలా బాలనటుడు నుంచి తండ్రికి తగ్గ నటుడిగా టాలీవుడ్ కి సూపర్ స్టార్ గా ఎదిగారు మహేష్ బాబు. బాలనటుడిగా మొట్టమొదటి సారిగా నీడ అనే చిత్రంలో నటించారు మహేష్ బాబు. దాసరి నారాయణరావు నిర్మాణంలో రూపొందిన ఈ చిత్రం నవంబర్ 29,1979న విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. అయితే ఈ సినిమా విడుదలై నేటితో 41 ఏళ్లు పూర్తి చేసుకుంది.
దీనితో మహేష్ బాబు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి 41 ఏళ్లు అవుతుంది అన్నమాట. ఈ చిత్రంలో మహేష్ అన్నయ్య రమేష్ బాబు హీరోగా నటించారు. ఇది ఆయనకు రెండవ చిత్రం కావడం విశేషం. ఈ సందర్భంగా మహేష్ బాబు అభిమానులు సోషల్ మీడియాలో # 41YrsOfSSMBMasteryInTFI అనే హ్యాష్‌ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తున్నారు.
నీడ సినిమాతో టాలీవుడ్ లోకి బాలనటుడిగా ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన రాజకుమారుడు సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. మురారి, ఒక్కడు, అతడు సినిమాలతో నటుడిగా తానేంటో నిరూపించుకున్నమహేష్ బాబు పోకిరి సినిమాతో ఇండస్ట్రీలో కొత్త రికార్డులను తిరగరాశారు. ఇక దూకుడు సినిమా నుంచి మహేష్ సూపర్ సక్సెస్ లతో దూసుకుపోతున్నారు.
కాగా, మహేష్ ఈ ఏడాది సరిలేరు నీకెవ్వరు చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఇండస్ట్రీ హిట్ కొట్టారు. ప్రస్తుతం మహేష్ బాబు పరుశురాం దర్శకత్వంలో సర్కారు వారి పాట అనే సినిమాని చేస్తున్నాడు. ఈ సినిమాలో మహేష్ బాబు సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. తమన్ సంగీతం అందిస్తున్నాడు. జనవరి నుంచి సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.