Movie News: హిట్టు కోసం గోపీచంద్ – శ్రీను వైట్ల ప్రయత్నం ఫలిస్తుందా?

Srinu Vaitla: శ్రీను వైట్ల పేరు తెలియని వారు ఇండస్ట్రీలో ఉండరేమో.

Update: 2022-09-20 15:00 GMT
Srinu Vaitla Come Back to Form with his Next Project

Movie News: హిట్టు కోసం గోపీచంద్ – శ్రీను వైట్ల ప్రయత్నం ఫలిస్తుందా?

  • whatsapp icon

Srinu Vaitla: శ్రీను వైట్ల పేరు తెలియని వారు ఇండస్ట్రీలో ఉండరేమో. ప్రముఖ డైరెక్టర్ గా ఎన్నో సూపర్ హిట్ సినిమాలను అందించారు శ్రీను వైట్ల. వెంకీ, దుబాయ్ శీను, ఢీ, రెడీ, దూకుడు, బాద్షా వంటి బ్లాక్ బస్టర్ సినిమాలతో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు శ్రీను వైట్ల. ఇలా శ్రీను వైట్ల దర్శకత్వం వహించిన చాలావరకు కామెడీ ఎంటర్టైనర్లు మీమ్స్ గా ఏదో ఒకచోట ఎప్పటికప్పుడు కనిపిస్తూనే ఉంటాయి. కానీ బాద్షా సినిమా తర్వాత శ్రీను వైట్ల దర్శకత్వం వహించిన ఒక్క సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించలేకపోయింది.

ఈ మధ్యకాలంలో శ్రీను వైట్ల దర్శకత్వం వహించిన అమర్ అక్బర్ ఆంటోనీ, మిస్టర్, బ్రూస్ లీ వంటి సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ లుగా నిలిచాయి. గత నాలుగు ఏళ్లుగా శ్రీను వైట్ల ఒక్క సినిమాకి కూడా దర్శకత్వం వహించలేదు. అయితే తాజాగా ఇప్పుడు శ్రీను వైట్ల మళ్లీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం గోపీచంద్ హీరోగా శ్రీను వైట్ల ఒక సినిమాకి దర్శకత్వం వహించడానికి రెడీ అవుతున్నారట.

కోన వెంకట్ ఈ సినిమాని మంచి బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. గతంలో కోన వెంకట్, శ్రీను వైట్ల మరియు గోపి మోహన్ ల కాంబినేషన్లో కొన్ని హిట్ సినిమాలు కూడా వచ్చాయి. తాజాగా ఇప్పుడు గోపీచంద్ సినిమా కోసం కూడా ఈ ముగ్గురు కలిసి పని చేయనున్నారు. ఈ నేపథ్యంలో శ్రీను వైట్ల ఈసారి గోపీచంద్ తో కచ్చితంగా ఒక మంచి హిట్ కొడతాడు అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా గురించిన అధికారిక ప్రకటన మరియు మరిన్ని వివరాలు త్వరలో తెలియనున్నాయి. మరోవైపు వరుస డిజాస్టర్లతో సత్వతమవుతున్న గోపీచంద్ కూడా ఈ సినిమాతో ఎలాగైనా మంచి హిట్ అందుకోవాలని కోరుకుంటున్నారు.

Tags:    

Similar News