Sreeleela: రష్మిక చేయాల్సిన సినిమా నాకెలా వచ్చిందంటే.. శ్రీలీలా ఇంట్రెస్టింగ్ కామెంట్స్‌

Sreeleela: నితిన్‌, శ్రీలీలన జంటగా వెంకీ కుడుముల దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ‘రాబిన్‌హుడ్‌’.

Update: 2025-03-26 11:30 GMT
Sreeleela on Rashmika Role in Robinhood How she Got This Film

Sreeleela: రష్మిక చేయాల్సిన సినిమా నాకెలా వచ్చిందంటే.. శ్రీలీలా ఇంట్రెస్టింగ్ కామెంట్స్‌

  • whatsapp icon

Sreeleela: నితిన్‌, శ్రీలీలన జంటగా వెంకీ కుడుముల దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ‘రాబిన్‌హుడ్‌’. ఈ సినిమాను మార్చి 28న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. సినిమా విడుదల దగ్గర పడుతోన్న నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్స్‌లో వేగాన్ని పెంచింది. ఇందులో భాగంగానే తాజాగా హీరోయిన్‌ శ్రీలీలా విలేకర్లతో ముచ్చటించింది. ఈ సందర్భంగా ఆమె పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది.

నిజానికి ఈ సినిమాలో ముందు హీరోయిన్‌గా రష్మికను తీసుకోవాలని అనుకున్నారు. అయితే ఆమెకు డేట్స్‌ అడ్జెస్ట్‌ కాకపోవడంతో ఈ అవకాశం తనకు వచ్చిందని శ్రీలీలా చెప్పుకొచ్చింది. కథ నచ్చడంతో సినిమాకు వెంటనే ఓకే చెప్పానని తెలిపింది. ఇక గతేడాది వరుసగా సినిమాల విడుదలతో చాలా బిజీగా గడిచిందన్న బ్యూటీ, రోజుకు 4-5 షిఫ్ట్‌ల వరకు పని చేసిన సందర్భాలున్నాయని చెప్పుకొచ్చింది.

అయితే మెడిసిన్ ఫైనల్ ఇయర్‌ పూర్తయ్యే సమయానికి ఒక ఏడాది బ్రేక్ తీసుకోవాల్సి వచ్చిందని తెలిపింది. దీంతో కొన్ని మంచి సినిమాలు చేజారిపోయాయని, ఇప్పుడు చదువు పూర్తయింది. కాలేజీలో కొన్ని రూల్స్ ఉండటంతో వాటిని అనుసరించి క్లాస్‌లు అటెండ్ అవుతున్నానని తెలిపింది. ఇక తాను బాలీవుడ్‌కు వెళ్లిపోతానని వస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదని, తెలుగు ఇండస్ట్రీ అంటే తనకు ఎంతో ఇష్టమని, బాలీవుడ్‌ ఆఫర్లు వచ్చినా తెలుగు సినిమాలను వదిలే ప్రసక్తే లేదని క్లారిటీ ఇచ్చింది.

ఇక హీరో నితిన్‌ గురించి మాట్లాడుతూ.. 'నితిన్‌తో ఇది నా రెండో సినిమా. ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మన్‌’ తర్వాత మళ్లీ కలిసి పనిచేయడం చాలా కంఫర్టబుల్‌గా అనిపించింది. నితిన్‌ చాలా ఫ్యామిలీ పర్సన్‌లా ఉంటారు. మా కాంబినేషన్‌ హిట్‌ అవుతుందని నమ్మకం ఉంది' అని ధీమా వ్యక్తం చేసింది. శ్రీలీలా కెరీర్ విషయానికొస్తే ఈ బ్యూటీ ప్రస్తుతం.. రవితేజతో ‘మాస్ జాతర’, సాయి ధనంజయ్‌తో ‘పరాశక్తి’, అలాగే తెలుగు, కన్నడ భాషల్లో ‘జూనియర్‌’ అనే సినిమాలో నటిస్తోంది. ఇంకా కొన్ని సినిమాలు లైన్‌లో ఉన్నాయి. త్వరలోనే మేకర్స్ ప్రకటిస్తారని చెప్పుకొచ్చింది. 

Tags:    

Similar News