
టాలీవుడ్‌లో గ్లామర్ క్వీన్‌గా గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్లలో రంభ ఒకరు. విజయవాడలో జన్మించిన రంభ సినిమా ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసింది. పేరుకు తెలుగమ్మాయే అయినా మలయాళంలో వచ్చిన 'స్వర్గం' అనే సినిమాతో వెండి తెరకు పరిచయమైందీ బ్యూటీ. ఆ తర్వాత తెలుగుతో పాటు తమిళ, మలయాళ సినిమాల్లో ఎన్నో చిత్రాల్లో నటించింది.
కెరీర్‌లో దాదాపు పదేళ్ల పాటు టాప్ హీరోయిన్‌గా రాణించిందీ బ్యూటీ. పెళ్లి తర్వాత కుటుంబానికే పరిమితమైన రంభ క్రమంగా సినిమాలకు దూరమైంది. అప్పట్లో అల్లు అర్జున్ హీరోగా వచ్చి దేశ ముదురు చిత్రంలో స్పెషల్ సాంగ్‌లో నటించి మెప్పించింది. ఇదిలా ఉంటే రంభ అసలు వేరే ఉందన్న విషయం మీకు తెలుసా.? మలయాళం ‘సర్గం’ చిత్రంతో వెండితెరకు పరిచయమైన రంభ అసలు పేరు విజయలక్ష్మి. అయితే సర్గం ఆ సినిమాలో ‘అమృత’ అనే స్క్రీన్ నేమ్‌తో నటించింది.
కానీ తెలుగులో ‘ఆ ఒక్కటి అడక్కు’ సినిమా చేసినప్పుడు దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ కొత్త పేరును సూచించారు. ఆ సినిమాలో ఆమె పాత్ర పేరు రంభ కావడంతో, అదే పేరును సినిమాటిక్ నేమ్‌గా మార్చాలని నిర్ణయించారు. అప్పటికి రంభ వయస్సు 16 ఏళ్లు మాత్రమే. ఆమె ఎంతో టాలెంటెడ్‌గా డాన్స్ చేయడం, నటించడంతో దర్శకులు, సహనటీనటులు ఆశ్చర్యపోయేవారు. దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ ఆమెను ప్రోత్సహించేందుకు ‘సీన్ బాగా చేస్తే చాక్లెట్ ఇస్తా’ అంటూ చిలిపిగా ప్రోత్సహించేవారని రంభ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.
ఇలా విజయలక్ష్మి, అమృతగా, అమృత పేరు కాస్త రంభగా మారింది. ఈ బ్యూటీ టాలీవుడ్‌తో పాటు తమిళ, హిందీ, మలయాళ, కన్నడ సినిమాల్లో నటించింది. కెరీర్‌లో పదేళ్లపాటు టాప్ హీరోయిన్‌గా కొనసాగిన రంభ పెళ్లి తర్వాత పూర్తిగా కుటుంబానికే పరిమితమైంది. ప్రస్తుతం విదేశాల్లో తన కుటుంబంతో జీవితాన్ని ఆనందంగా గడుపుతోంది.