OTT Movie: ఓటీటీలోకి మరో క్రైమ్ థ్రిల్లర్.. ఇంతకీ అది హత్యా, ఆత్మహత్యా.?
OTT Movie: సస్పెన్స్, క్రైమ్ థ్రిల్లర్‌లకు ప్రేక్షకులు ఎంతగా ఆదరిస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
OTT Movie: ఓటీటీలోకి మరో క్రైమ్ థ్రిల్లర్.. ఇంతకీ అది హత్యా, ఆత్మహత్యా.?
OTT Movie: సస్పెన్స్, క్రైమ్ థ్రిల్లర్‌లకు ప్రేక్షకులు ఎంతగా ఆదరిస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. భాషతో సంబంధం లేకుండా ఇలాంటి సినిమాలకు జై కొడుతారు. ఈ నేపథ్యంలో తాజాగా ప్రేక్షకులను పలకరించేందుకు మరో సినిమా సిద్ధమవుతోంది. మలయాళ క్రైమ్ థ్రిల్లర్ త్వరలో ఓటీటీలో సందడి చేయబోతోంది. సౌబిన్ షాహిర్, బసిల్ జోసెఫ్, చెంబన్ వినోద్ జోస్ ప్రధాన పాత్రల్లో రూపొందిన ‘ప్రావింకూడు షాపు’ (Pravinkoodu Shappu) బ్లాక్ కామెడీ క్రైమ్ థ్రిల్లర్. శ్రీరాజ్ శ్రీనివాసన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా జనవరి 16న థియేటర్లలో విడుదలై, మంచి విజయాన్ని అందుకుంది.
తాజాగా ఈ చిత్ర ట్రైలర్ విడుదల కాగా, ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది. ‘ప్రావింకూడు షాపు’ ఈ నెల 11 నుంచి ‘సోనీలివ్’ (SonyLiv) ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. మలయాళంతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో అందుబాటులోకి రానుంది.
హత్యా? ఆత్మహత్యా?
కథలో ప్రధానంగా ఒక కల్లు దుకాణం యజమాని హత్య చుట్టూ మిస్టరీ నడుస్తుంది. భారీ వర్షం కారణంగా ఆ షాపులో 11 మంది రాత్రంతా ఉండిపోతారు. వేకువవేళలే షాపు యజమాని మృతదేహంగా మారిపోతాడు. ఈ 11 మందిలో ఎవరో ఒకరు హంతకుడని అనుమానం. కేసును చేదించేందుకు ఓ పోలీసు అధికారి రంగంలోకి దిగుతాడు. దర్యాప్తులో అతను ఎదుర్కొన్న అనూహ్య వాస్తవాలు ఏంటి? ఈ హత్య వెనుక ఉన్న అసలు సూత్రధారులు ఎవరు? అనేదే కథ.
వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా హ్యూమర్, థ్రిల్, మిస్టరీతో పాటు ప్రేక్షకులను ఆసక్తిగా ఉంచే కథనంతో సాగుతుంది. గతంలో ‘కుంభలంగి నైట్స్’, ‘జోజి’ లాంటి సినిమాలను ఎంతగానో ఇష్టపడిన వారికి ‘ప్రావింకూడు షాపు’ మరో కొత్త అనుభూతినిస్తుంది. థ్రిల్ కోరుకునే వారికి ఈ సినిమా తప్పక నచ్చుతుందనడంలో సందేహం లేదు.