Shivam Dube: హిందూ క్రికెటర్, ముస్లిం హీరోయిన్ లవ్ స్టోరీ.. పెళ్లితో ఒక్కటైన భిన్న మతాల జంట!
Shivam Dube: స్నేహం ప్రేమగా మారింది. ఆపై వారిద్దరూ వివాహం చేసుకున్నారు.ఇది ఐపీఎల్ ఆడుతున్న ఒక హిందూ క్రికెటర్, అతని కంటే 7 సంవత్సరాలు పెద్దదైన ఒక ముస్లిం హీరోయిన్ లవ్ స్టోరీ.

Shivam Dube: హిందూ క్రికెటర్, ముస్లిం హీరోయిన్ లవ్ స్టోరీ.. పెళ్లితో ఒక్కటైన భిన్న మతాల జంట!
Shivam Dube: స్నేహం ప్రేమగా మారింది. ఆపై వారిద్దరూ వివాహం చేసుకున్నారు.ఇది ఐపీఎల్ ఆడుతున్న ఒక హిందూ క్రికెటర్, అతని కంటే 7 సంవత్సరాలు పెద్దదైన ఒక ముస్లిం హీరోయిన్ లవ్ స్టోరీ. వీరిద్దరూ తమ ప్రేమను పెళ్లి బంధంతో శాశ్వతం చేసుకున్నారు. ఇంతకీ ఎవరా క్రికెటర్, హీరోయిన్ అంటే.. ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడుతున్న శివమ్ దూబే, అంజుమ్ ఖాన్. వీరి వివాహం 2021లో జరిగింది. అప్పుడు శివమ్ దూబే రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడేవాడు. అంజుమ్ ఖాన్ మోడలింగ్ , యాక్టింగ్ కూడా చేశారు. ఆమె పలు టీవీ సీరియల్స్‌లో నటించడమే కాకుండా, బాలీవుడ్ సినిమాల్లో వాయిస్ ఆర్టిస్ట్‌గా తన గొంతును వినిపించారు.
శివమ్ దూబే, అంజుమ్ ఖాన్ ఒక్కటం అంతా సులువుగా జరుగలేదు. వేర్వేరు మతాలకు చెందిన కుటుంబాలు కావడంతో ఇరువైపుల నుండి అడ్డంకులు వచ్చాయి. కానీ, చివరికి శివమ్, అంజుమ్ ప్రేమ గెలిచింది. వీరిద్దరూ హిందూ, ముస్లిం సంప్రదాయాల ప్రకారం వివాహం చేసుకున్నారు. వీరి వివాహంపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వచ్చాయి. కానీ, వారి కుటుంబాలే కాకుండా సమాజం కూడా వారి ప్రేమ ముందు తలవంచక తప్పలేదు.
శివమ్ దూబే, అంజుమ్ ఖాన్ ఇప్పుడు ఇద్దరు పిల్లల తల్లిదండ్రులు. వివాహం జరిగిన మరుసటి సంవత్సరం అంటే 2022లో వారికి ఒక కుమారుడు జన్మించాడు. ఈ సంవత్సరం జనవరిలో వారికి ఒక కుమార్తె కలిగింది. వారి కుమారుడి పేరు అయాన్, కుమార్తె పేరు మెహవిష్.
శివమ్ దూబే ప్రస్తుతం ఐపీఎల్ 2025లో బిజీగా ఉన్నాడు. ఈ సీజన్‌లో అతను చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడుతున్నాడు. సీఎస్‌కే అతడిని 12 కోట్ల రూపాయలకు రిటైన్ చేసుకుంది. ఐపీఎల్ 2025లో ఇప్పటివరకు ఆడిన 4 మ్యాచ్‌లలో అతను 64 పరుగులు చేశాడు. ఇందులో అతని అత్యధిక స్కోరు 19 పరుగులు. శివమ్ దూబే నుండి జట్టు ఎలాంటి ప్రదర్శనను ఆశిస్తోందో, అతను ఇప్పటివరకు ఆ స్థాయిలో రాణించలేదని స్పష్టంగా తెలుస్తోంది.
ఐపీఎల్‌లో సీఎస్‌కే శివమ్ దూబే మూడవ జట్టు. అతను 2022 నుండి చెన్నై సూపర్ కింగ్స్‌తో ఉన్నాడు. అంతకుముందు ఐపీఎల్ 2021లో అతను రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడాడు. ఐపీఎల్ 2019, ఐపీఎల్ 2020లో అతను ఆర్‌సీబీ తరపున ఆడాడు. శివమ్ దూబే తన ఐపీఎల్ కెరీర్‌ను ఆర్‌సీబీ తరపుననే ప్రారంభించాడు.