Imanvi esmail: నేను పాకిస్తాన్ అమ్మాయిని కాదు.. ప్రభాస్ హీరోయిన్ పోస్ట్ వైరల్
Imanvi esmail: జమ్ము కాశ్మీర్ లో జరిగిన ఉగ్రదాడిని యావద్భారతం ఖండించింది. ఈ దాడి నేపథ్యంలో దాయాది పాకిస్తాన్ తో సంబంధాలపై భారత ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే.

I am not a Pakistani girl Prabhas' heroine Imanvi esmail post goes viral
Imanvi esmail: జమ్ము కాశ్మీర్ లో జరిగిన ఉగ్రదాడిని యావద్భారతం ఖండించింది. ఈ దాడి నేపథ్యంలో దాయాది పాకిస్తాన్ తో సంబంధాలపై భారత ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే పాకిస్తాన్ నటీనటులు మన సినిమాల్లో నటించడానికి వీల్లేదంటూ నెట్టింట పోస్టులు వైరల్ అవుతున్నాయి. దీంతో ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి డైరెక్షన్ లో తెరకెక్కబోతున్న మూవీలో హీరోయిన్ ఇమాన్వీ ఎస్మాయిల్ ఒక్కసారిగా హాట్ టాపిగ్గా మారారు. ఆమె పాకిస్తాన్ అమ్మాయి అంటూ ..ఆమెను తీసుకోవద్దంటూ పోస్టులు వైరల్ అవుతున్నాయి. ఈ విషయంపై ఇమాన్వీ క్లారిటీ ఇచ్చారు. తాను పాకిస్తాన్ నటిని కాదని..స్పష్టం చేస్తూ పోస్ట్ పెట్టారు. ఉగ్రదాడిని ఖండిస్తూ మ్రుతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు.
నాకు, నా కుటుంబానికి సంబంధించిన కొన్ని తప్పుడు వార్తలు ప్రచారం అవుతున్నాయి. నేను పాకిస్థానీని కాదు..నాకు నా కుటుంబంలోని ఎవరికీ ఆ దేశంతో ఎలాంటి సంబంధాలు లేవు. నాపై ద్వేషాన్ని కలిగించాలనే ఏకైక ఉద్దేశ్యంతో ఇలాంటి వార్తలు ప్రచారం చేస్తున్నారు. కొన్ని పేరున్న వార్తా సంస్థలు కూడా నా విషయంలో కనీస పరిశోధనలు చేయకుండా తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నాయంటూ పేర్కొన్నారు.
నేను భారత అమెరికన్ను అని ఎంతో గర్వంగా చెబుతాను. హిందీ, తెలుగు, గుజరాతీ, ఇంగ్లీష్ స్పష్టంగా మాట్లాడగలను. లాస్ ఏంజెలెస్ లో పుట్టాను. నా పేరెంట్స్ అమెరికాకు వలసవెళ్లి..అక్కడి పౌరులుగా మారారు. నేను చదివింది కూడా అక్కడే. చదువు పూర్తయిన తర్వాత నటిగా, కొరియోగ్రాఫర్ గా , డ్యాన్సర్ గా నా కెరీర్ ను ప్రారంభించాను. ఈ రంగంలో ఎంతోకాలం కొనసాగిన తర్వాత భారతీయ చిత్ర పరిశ్రమలో పనిచేసే అవకాశాలను అందుకున్నాను ఈ విషయంలో ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. సినిమా నా జీవితంపై గొప్ప ప్రభావాన్ని చూపింది. భారతీయత భారత సంస్క్రుతి నా రక్తంలోనే ఉంది. సోషల్ మీడియాను మంచి కోసం ఉపయోగించండంటూ పోస్టులో రాసుకొచ్చారు. ఉగ్రదాడి ఘటన దారుణమని మరణించినవారి కుటుంబాలకు సంతాపం తెలిపారు.