HIT 3: అప్పుడే మొదలైన హిట్3 రికార్డుల వేట.. అడ్వాన్స్ బుకింగ్స్ లో క్రేజీ రికార్డు
HIT 3: నేచురల్ స్టార్ నాని నటిస్తున్న క్రైమ్ థ్రిల్లర్ "హిట్ - ది థర్డ్ కేసు" (HIT 3) ఇప్పటికే భారీ అంచనాలు సెట్ చేసుకుంది. 'హిట్' యూనివర్స్‌లో మూడో పార్ట్‌గా వస్తున్న ఈ చిత్రానికి శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్నారు.

HIT 3: అప్పుడే మొదలైన హిట్3 రికార్డుల వేట.. అడ్వాన్స్ బుకింగ్స్ లో క్రేజీ రికార్డు
HIT 3: నేచురల్ స్టార్ నాని నటిస్తున్న క్రైమ్ థ్రిల్లర్ "హిట్ - ది థర్డ్ కేసు" (HIT 3) ఇప్పటికే భారీ అంచనాలు సెట్ చేసుకుంది. 'హిట్' యూనివర్స్‌లో మూడో పార్ట్‌గా వస్తున్న ఈ చిత్రానికి శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సారి నాని ఒక పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ అర్జున్ సర్కార్ పాత్రలో కనిపించబోతుండగా, మాస్ యాంగిల్‌లో అతన్ని చూసేందుకు అభిమానులు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. హీరోయిన్‌గా ‘కేజీఎఫ్’ ఫేమ్ శ్రీనిధి శెట్టి నటిస్తోంది.
ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్, ట్రైలర్ చిత్రంపై అంచనాలు పెంచేశాయి. ఈ సినిమా 2025 మే 1న గ్రాండ్ రిలీజ్ కాబోతుండగా, ప్రపంచవ్యాప్తంగా భారీ ఓపెనింగ్స్ కోసం మేకర్స్ సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా ఓవర్సీస్ మార్కెట్‌లో 'హిట్ 3'పై మంచి బజ్ ఉంది. ఇప్పటికే యూఎస్‌లో ప్రీమియర్ షోల కోసం అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం అయ్యాయి. మే 1కి వారం ముందే ఈ చిత్రం లక్ష డాలర్ల ప్రీ-సేల్స్ సాధించిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఇది నాని సినిమా ఓవర్సీస్ ప్రీమియర్ వసూళ్లలో అత్యంత వేగంగా లక్ష డాలర్లకు చేరిన సినిమాగా నిలిచింది.
నాని ఈసారి అమెరికాలో ప్రమోషన్స్ కోసం వ్యక్తిగతంగా హాజరయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ‘దసరా’, ‘శ్యామ్ సింగ రాయ్’ వంటి సినిమాలతో ఓవర్సీస్ మార్కెట్లో నాని మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు 'హిట్ 3' ద్వారా ఆ హైప్‌ను మళ్లీ కొనసాగించేందుకు నాని సిద్ధమవుతున్నాడు. ఇదిలా ఉంటే HIT యూనివర్స్‌లో మొదటి రెండు భాగాలు (హిట్: ది ఫస్ట్ కేస్, హిట్: ది సెకండ్ కేస్) మంచి విజయాలను అందుకున్నాయి. ఇప్పుడు ఈ మూడో భాగం ఆ స్థాయిని దాటుతుందా అన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది.