Devara: దేవరకు ఎందుకీ పరిస్థితి.? నెట్టింట ట్రెండ్ అవుతోన్న కొత్త చర్చ
Devara: జూనియర్ ఎన్టీఆర్ నటించిన తాజా చిత్రం ‘దేవర: పార్ట్ 1’ చిత్రం గత సంవత్సరం సెప్టెంబర్ 27న విడుదలై మంచి వసూళ్లను రాబట్టిన విషయం తెలిసిందే.

Devara: దేవరకు ఎందుకీ పరిస్థితి.? నెట్టింట ట్రెండ్ అవుతోన్న కొత్త చర్చ
Devara: జూనియర్ ఎన్టీఆర్ నటించిన తాజా చిత్రం ‘దేవర: పార్ట్ 1’ చిత్రం గత సంవత్సరం సెప్టెంబర్ 27న విడుదలై మంచి వసూళ్లను రాబట్టిన విషయం తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కథానాయికగా, సైఫ్ అలీఖాన్ విలన్ పాత్రలో నటించారు. రూ. 300 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో విడుదలై మంచి విజయాన్ని నమోదు చేసుకుంది.
మొదట్లో ఈ సినిమాకు ఆశించిన స్థాయిలో రాలేకపోయిన్పటికీ కమర్షియల్‌గా మాత్రం మంచి విజయాన్ని నోమదు చేసుకుంది. జపాన్ లోనూ ఈ చిత్రం విడుదలై మాస్ ఆడియెన్స్ నుంచి భారీ రెస్పాన్స్‌ను రాబట్టింది. కానీ ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ఓ అంశం ఫిల్మ్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది. విడుదలై ఏడు నెలలు గడిచినా శాటిలైట్ హక్కులు ఇంకా అమ్ముడుపోనందుకు సంబంధించి చర్చలు సాగుతున్నాయి.
శాటిలైట్ రైట్స్ విషయంలో మేకర్స్ ఎందుకు ఆలస్యం చేస్తున్నారు? వారికి అవసరం లేక తామే దాచిపెట్టారా? లేదా డిమాండ్ చేసిన ధరకు కొనుగోలు చేయడానికి ఎవరూ ముందుకు రావడం లేదా? అనే ప్రశ్నలు చర్చకు వస్తున్నాయి. అయితే డిజిటల్ రైట్స్ విషయానికి వస్తే, ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ ఈ హక్కులను రూ. 155 కోట్ల భారీ ధరకు సొంతం చేసుకుంది. ఓటీటీలోకి వచ్చిన ఈ సినిమా ఇంతవరకు టీవీలో మాత్రం టెలికాస్ట్ కాలేదు.
కాగా మేకర్స్ ఇప్పటికే ‘దేవర పార్ట్: 2’ సీక్వెల్‌ను ప్రకటించారు. ఈ సినిమాకు సంబంధించి ప్రీ-ప్రొడక్షన్ పనులు జరుగుతున్నట్టు సమాచారం. ఇంకొకవైపు ఎన్టీఆర్ బాలీవుడ్‌లో 'వార్ 2' చిత్రం ద్వారా ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఈ యాక్షన్ ఎంటర్టైనర్ 2025 ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. అదే సమయంలో ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కనున్న 'డ్రాగన్' సినిమా షూటింగ్‌ను ఎన్టీఆర్ ఇటీవలే ఏప్రిల్ 22న ప్రారంభించారు.