SSMB 29: ఒక్క సన్నివేశానికే రూ. 100 కోట్లు.. రాజమౌళి, మహేబ్ బాబు మూవీ ఇంట్రెస్టింగ్ అప్డేట్..!
SSMB 29: ఇండియన్ సినిమా రంగాన్ని కొత్త మలుపుల దిశగా నడిపిస్తున్న దర్శకుడు రాజమౌళి, మరోసారి భారీ ప్రాజెక్టుతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.

SSMB 29: ఒక్క సన్నివేశానికే రూ. 100 కోట్లు.. రాజమౌళి, మహేబ్ బాబు మూవీ ఇంట్రెస్టింగ్ అప్డేట్..!
SSMB 29: ఇండియన్ సినిమా రంగాన్ని కొత్త మలుపుల దిశగా నడిపిస్తున్న దర్శకుడు రాజమౌళి, మరోసారి భారీ ప్రాజెక్టుతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ‘ఆర్ఆర్ఆర్’తో అంతర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్న ఆయన, ఇప్పుడు మహేష్ బాబుతో తెరకెక్కిస్తున్న చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
కేఎల్ నారాయణ నిర్మాణంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్ర బడ్జెట్ దాదాపు రూ.1000 కోట్లుగా చెబుతున్నారు. అయితే దీనికి సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. ఇప్పటికే ఇప్పటికే రెండు షెడ్యూల్లు పూర్తయ్యాయి. ప్రస్తుతం హైదరాబాదులో మూడవ షెడ్యూల్ జరగుతోందని సమాచారం. ఈ చిత్రంలో ప్రియాంక చోప్రా కథానాయికగా, పృథ్వీరాజ్ సుకుమారన్ ముఖ్యపాత్రలో కనిపించనున్నారు.
ఈ ప్రాజెక్టుకు విజయేంద్రప్రసాద్ కథ అందించగా, ఎమ్ ఎమ్ కీరవాణి సంగీతం సమకూరుస్తున్నారు. అమెజాన్ అడవుల్లో సాగే యాక్షన్ అడ్వెంచర్ నేపథ్యంలో ఈ సినిమా రూపొందుతోంది. అత్యంత ప్రతిష్టాత్మకంగా, ప్రతి సీన్‌ను అత్యున్నత ప్రమాణాలతో తెరకెక్కించేందుకు రాజమౌళి నష్టనష్టాలకూ తెరలేకుండా ముందుకెళ్తున్నారని తెలుస్తోంది. ఒకే ఒక్క యాక్షన్ సీన్ కోసం దాదాపు రూ.100 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి.
హాలీవుడ్ యాక్షన్ కొరియోగ్రాఫర్ ఆధ్వర్యంలో చిత్రీకరిస్తున్న ఈ సీన్‌కు భారీ స్థాయిలో గ్రాఫిక్స్ వర్క్ కూడా జరుగుతోందని సమాచారం. ఈ యాక్షన్ ఎపిసోడ్ కోసం ప్రత్యేకంగా ఓ భారీ సెట్‌ను నిర్మించారు. మరి ఇన్ని అంచనాల నడుమ తెరకెక్కుతోన్న ఈ సినిమా ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఇదిలా ఉంటే ఇప్పటికీ రెండు షెడ్యూల్‌లు పూర్తయినా సినిమా టైటిల్‌కు సంబంధించిన చిత్ర యూనిట్ ఎలాంటి ప్రకటన చేయకపోవడం గమనార్హం.