Actress: తలపై కోతి ఉన్న ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా.? అందం, నటనకు కేరాఫ్ ఈ బ్యూటీ..!
Actress: చిన్ననాటి ఫటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్న వారి సంఖ్య ఇటీవల పెరిగింది. సామాన్యులతో సెలబ్రిటీలు తమ చిన్ననాటి జ్ఞపకాలను సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేస్తున్నారు.

Actress: తలపై కోతి ఉన్న ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా.? అందం, నటనకు కేరాఫ్ ఈ బ్యూటీ..!
Actress: చిన్ననాటి ఫటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్న వారి సంఖ్య ఇటీవల పెరిగింది. సామాన్యులతో సెలబ్రిటీలు తమ చిన్ననాటి జ్ఞపకాలను సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేస్తున్నారు. తాజాగా ఇలాంటి ఓ ఫొటో నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది.
నెత్తిపై కోతితో చూడ్డానికి క్యూట్‌గా కనిస్తున్న ఈ చిన్నారి ఇప్పుడు టాలీవుడ్‌లో క్రేజీ అండ్ డేరింగ్ హీరోయిన్. సినిమాలు ఎక్కువగా చేయకపోయినా, వచ్చిన అవకాశాల్లోనే తన ప్రతిభను నిరూపించుకుంది. హీరోయిన్ గానే కాదు, బలమైన పాత్రలైనా స్వీకరించడంలో వెనుకాడలేదు. కొన్ని సినిమాల్లో సంప్రదాయ గెటప్‌లో కనిపించిన ఈ ముద్దుగుమ్మ, మరికొన్ని సినిమాల్లో బోల్డ్ అండ్ రొమాంటిక్ పాత్రల్లో కూడా మెప్పించింది.
అంతేకాకుండా, ఒక సినిమాలో వేశ్య పాత్రను పోషించి తన నటనతో అందరినీ ఆకట్టుకుంది. ఆ చిత్రం పెద్ద హిట్టవటంతో ఈ బ్యూటీకి మంచి గుర్తింపు కూడా వచ్చింది. ఇంతకీ ఈ చిన్నది ఎవరో గుర్తుపట్టరా.? ఈ హీరోయిన్ మరెవరో కాదు, 'కేరాఫ్ కంచరపాలెం' ఫేమ్ ప్రణీత పట్నాయక్.
2018లో వచ్చిన 'కేరాఫ్ కంచరపాలెం'లో భార్గవి అనే మిడిల్ క్లాస్ అమ్మాయి పాత్రలో అద్భుత నటనను కనబరించిన ఈ చిన్నది ఆ తర్వాత కూడా సినిమాల్లో తన ప్రత్యేకతను చూపించింది. దుల్కర్ సల్మాన్ సినిమా 'సీతారామం'లో వేశ్య పాత్రలో కనిపించి మంచి నటనను కనబరించింది. అలాగే 'నెట్' సినిమాలో రాహుల్ రామకృష్ణ భార్య పాత్రలో రొమాంటిక్ సన్నివేశాల్లో ఆకట్టుకుంది. ఇటీవల సన్నీ డియోల్ నటించిన బాలీవుడ్ మూవీ 'జాట్'లోనూ ఒక కీలక పాత్రలో సందడి చేసింది.
ప్రస్తుతం ఈ బ్యూటీ పలు సినిమాలతో బిజీగా ఉంది. సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ ఆమె మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసే గ్లామరస్ ఫోటోలతో కుర్రకారు హృదయాలను కొల్లగొడుతోంది. ఈ క్రమంలోనే ఈ బ్యూటీ చిన్ననాటి ఫొటో ఒకటి నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది.