Jr NTR: ఎన్టీఆర్ కోసం ప్రశాంత్ భారీ స్కెచ్.. మునుపెన్నడూ లేని విధంగా
Jr NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్ హిందీలో తన తొలి చిత్రం 'వార్ 2' షూటింగ్ పూర్తిచేసుకున్నాడు.

Jr NTR: ఎన్టీఆర్ కోసం ప్రశాంత్ భారీ స్కెచ్.. మునుపెన్నడూ లేని విధంగా
Jr NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్ హిందీలో తన తొలి చిత్రం 'వార్ 2' షూటింగ్ పూర్తిచేసుకున్నాడు. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్నచిత్రానికి పూర్తిగా డెడికేట్ కానున్నాడు. ఈ ప్రాజెక్ట్‌ను మొదట 'డ్రాగన్' అనే టైటిల్‌తో ప్రకటించినప్పటికీ, తాజా సమాచారం ప్రకారం సినిమాకు కొత్త పేరు పెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
కాగా ఈ సినిమా కోసం కర్ణాటకలోని కుంటా వద్ద భారీ సెట్ వేశారు. జూనియర్ ఎన్టీఆర్ ఇక్కడే కొన్ని రోజులు ఉండి షూటింగ్ చేస్తున్నాడు. సెట్‌లో హెలికాప్టర్, ఇళ్ల మోడల్స్, రైల్వే ట్రాక్‌లు, లోకోమోటివ్‌లు, భారీ గన్స్, ట్యాంకర్లు వంటి మాస్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఈ సెట్ చూడగానే సినిమా ఎంత గ్రాండ్‌గా రూపొందుతోందో అర్థమవుతుంది. ఈ సెట్‌ను రామనగర్ బీచ్ ప్రాంతంలో ప్రత్యేకంగా నిర్మించారు. 'కేజీఎఫ్', 'సలార్' వంటి చిత్రాలకు సెట్లు నిర్మించిన టీమ్‌నే ఇప్పుడు కూడా పని చేస్తోంది.
ప్రతి రోజు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు షూటింగ్ జరుగుతోంది. ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ సరసన రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటిస్తోంది. రవి బస్రుర్ మ్యూజిక్ డైరెక్టర్‌గా, భువన్ గౌడ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు. ప్రశాంత్ నీల్ తన గత విజయవంతమైన టీమ్‌ను ఈ సినిమాకు కొనసాగించాడు. ఈ యాక్షన్ డ్రామాలో ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేస్తారని సమాచారం. గత రెండు నెలలుగా షూటింగ్ సాగుతోంది. ఎన్టీఆర్ వారం క్రితం సెట్లో జాయిన్ అయ్యారు. ఎన్నో అంచనాల నడుమ తెరకెక్కుతోన్న ఈ సినిమా ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.