Mahesh Babu to ED: ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులకు మహేష్ బాబు రిక్వెస్ట్
ED notice to Mahesh Babu: ఈడి అధికారుల నోటీసులకు స్పందించిన మహేష్ బాబు

ఈడి నోటీసులకు స్పందించిన మహేష్ బాబు
Mahesh Babu latest news updates: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు రేపు ఏప్రిల్ 28న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారుల ముందు విచారణకు హాజరు కావాల్సి ఉంది. కానీ అంతకంటే ముందే మహేశ్ బాబు ఈడీ అధికారులకు ఒక లేఖ రాశారు. తను ప్రస్తుతం తన కొత్త సినిమా షూటింగ్ కోసం విదేశాల్లో ఉన్నందున రేపు విచారణకు రాలేకపోతున్నట్లు తెలిపారు . అంతేకాకుండా తను విచారణకు హాజరు అయ్యేందుకు వీలుగా మరొక డేట్ ఇవ్వాల్సిందిగా మహేష్ బాబు ఈడీ అధికారులను కోరారు.
సురాణ గ్రూప్, సాయి సూర్య డెవలపర్స్ సంయుక్తంగా చేపట్టిన రియల్ ఎస్టేట్ ప్రాపర్టీలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారుల విచారణ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సంస్థలు అనధికారిక లేఅవుట్లలో వెంచర్స్ వేయడం, అమ్మిన ప్లాట్స్ , ఫ్లాట్స్ నే మళ్ళీ మళ్ళీ అమ్మడం లాంటి నేరాలకు పాల్పడినట్లుగా అభియోగాలు ఎదుర్కొంటోంది. ఆయా లావాదేవీలపై రూ. 100 కోట్లకు పైగా అవినీతి జరిగినట్లు ఆరోపణలు వస్తున్నాయి.
ఇటీవల ఈ సంస్థల ప్రమోటర్స్ ఇళ్లు, కార్యాలయాలపై ఈడీ అధికారులు సోదాలు నిర్వహించి అనేక దస్త్రాలను పరిశీలించారు. ఇదే ప్రమోటర్స్ మహేష్ బాబుకు వారి బిజినెస్ ప్రమోషన్ కోసం రూ. 5.9 కోట్లు చెల్లించినట్లుగా ఈడీ అధికారులు గుర్తించారు. అందులో చెక్కుల ద్వారా రూ. 3.4 కోట్లు, నగదు రూపంలో మరో రూ. 2.5 కోట్లు చెల్లించినట్లు ఈడీ అధికారుల దృష్టికీ వచ్చింది.
ఈ నేపథ్యంలోనే మహేష్ బాబు నుండి ఆయా లావాదేవీలపై, సంస్థతో సంబంధాలపై మరిన్ని వివరాలు తెలుసుకోవాలని ఈడి అధికారులు ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగానే మహేష్ బాబుకు ఈడి నోటీసులు జారీ చేసింది.