Hit 3: మహాభారతంలో నాని పాత్ర, 10 పార్ట్స్‌గా సినిమా... రాజమౌళి ఆసక్తికర వ్యాఖ్యలు

Update: 2025-04-28 10:54 GMT
Hit 3: మహాభారతంలో నాని పాత్ర, 10 పార్ట్స్‌గా సినిమా... రాజమౌళి ఆసక్తికర వ్యాఖ్యలు
  • whatsapp icon

SS Rajamouli confirms Nani's role in Mahabharatam movie: ఎస్ఎస్ రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్ట్ మహాభారతం సినిమా గురించి ఎప్పటి నుండో అనేక వార్తలు, రూమర్స్ వింటున్నాం. కానీ ఈ విషయమై స్వయంగా రాజమౌళినే స్పందించిన సందర్భాలు మాత్రం చాలా అంటే చాలా అరుదు. ఎందుకంటే, రాజమౌళి తన సినిమాలకు సంబంధించినంత వరకు ఏ విషయమైనా చాలా గోప్యత పాటిస్తారనే విషయం తెలిసిందే. అలాగే మహా భారతం సినిమా విషయంలోనూ అదే జరుగుతోంది. కానీ తాజాగా రాజమౌళినే స్వయంగా మహాభారతం మూవీ గురించి ఒక ఆసక్తికమైన విషయాన్ని వెల్లడించారు.

మహాభారతం మూవీలో నాని నటిస్తున్నారా అని యాంకర్ సుమ అడిగిన ప్రశ్నకు రాజమౌళి స్పందించారు. ఆ సినిమాలో నానికి తప్పకుండా చోటు ఉంటుందని క్లారిటీ ఇచ్చారు. కాకపోతే ఆ పాత్ర ఏంటనేది ఇప్పుడప్పుడే క్లారిటీ ఇవ్వలేదు. నాని అప్ కమింగ్ సినిమా హిట్ 3- ది థర్డ్ కేస్ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొని మాట్లాడుతూ రాజమౌళి ఈ వ్యాఖ్యలు చేశారు. రాజమౌళి మహా భారతం సినిమాలో నానికి ఒక పాత్ర ఉందని తెలిశాక నాని అభిమానుల ఆనందానికి అడ్డుఅదుపు లేకుండా పోయింది.

మహా భారతం మూవీలో రామ్ చరణ్, తారక్‌లకు కూడా చోటు?

మహా భారతం సినిమాలో రామ్ చరణ్, తారక్ లకు కూడా అవకాశం ఉంటుందా అనే ప్రశ్నకు రాజమౌళి గతంలోనే క్లారిటీ ఇచ్చారు. ఇండియా టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజమౌళి ఈ ప్రశ్నకు స్పందిస్తూ..." తను తీయబోయే మహా భారతం సినిమాలో ఏ పాత్రకు ఏ నటుడు అయితే బాగుంటుంది అని లెక్కలేసుకుంటూ ఇప్పటికే చాలామంది చాలా విషయాలు చెబుతున్నారు. కానీ దేశంలో మహా భారతం విషయంలో చాలా వెర్షన్స్ అందుబాటులో ఉన్నాయి. అవన్నీ చదవడానికే తనకు ఒక ఏడాది పడుతుంది. తరువాత తన స్టైల్లో మహా భారతంను మల్చుకోవడానికి టైమ్ పడుతుంది. ఆ తరువాతే ఏ పాత్రకు ఎవరైతే బాగుంటుంది అనేది నిర్ణయించుకోగలను" అని బదులిచ్చారు.

10 భాగాలుగా మహా భారతం మూవీ

అయితే, మహాభారతం లాంటి అద్భుతమైన కావ్యంలో ఎందరో మహామహుల పాత్రలు ఉంటాయి. అటువంటప్పుడు ఆ కథను దృశ్య కావ్యంగా మలిచేందుకు రాజమౌళికి కచ్చితంగా ఎందరో స్టార్ హీరోల అవసరం ఉంటుంది అనే వాదన కూడా వినిపిస్తోంది. పైగా రాజమౌళి సినిమాల విషయానికొస్తే, ఆయన తన సినిమాలను ప్యాన్ ఇండియా లెవెల్లో ప్రమోట్ చేసుకునేందుకు నటీనటుల ఎంపిక నుండే ఆ ప్రక్రియను మొదలుపెడతారు. అంటే ఒక్క తెలుగు సినిమా నుండే కాకుండా దేశంలోని పేరున్న అన్ని సినీ పరిశ్రమల నుండి స్టార్ హీరో, హీరోయిన్స్‌కు మహా భారతంలో ఛాన్స్ ఇచ్చే అవకాశాలు లేకపోలేదనే టాక్ కూడా ఉంది.

అన్నింటికిమించి మహాభారతం కథను టీవీల్లో సీరియల్ గా ప్రసారం చేసినప్పుడే అది 266 ఎపిసోడ్స్ అయింది. మరి అలాంటి కథను సినిమాగా తీయడానికి కనీసం తనకు 10 పార్ట్స్ అయినా పడుతుంది అని రాజమౌళి గతంలోనే చెప్పిన విషయం కూడా తెలిసిందే.

ఇక నాని సినిమాల విషయానికొస్తే... ఆయన నటించిన హిట్: ది థర్డ్ కేస్ మే 1న రిలీజ్ కానుంది. హిట్: ది ఫస్ట్ కేస్, హిట్: ది సెకండ్ కేస్, సైంధవ్ సినిమాలను డైరెక్ట్ చేసిన శైలేష్ కొలను ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. వయోలెన్స్ ఎక్కువగా ఉన్న ఈ సినిమాకు సెన్సార్ బోర్డ్ A సర్టిఫికెట్ జారీ చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు రాజమౌళి ప్రస్తుతం మహేష్ బాబు సినిమాతో బిజీగా ఉన్నారు. విదేశాల్లో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది.  

Tags:    

Similar News