Tollywood: నాని మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న కిచ్చా సుదీప్ కూతురు

Tollywood: స్టార్ హీరోల వార‌సులు ఇండ‌స్ట్రీకి ఎంట్రీ ఇవ్వ‌డం స‌ర్వ‌సాధార‌ణ‌మైన విష‌యం. అయితే వీరిలో పురుషుల సంఖ్యే ఎక్కువ‌గా ఉండేది. కానీ ప్ర‌స్తుతం అమ్మాయిలు కూడా అబ్బాయుల‌కు పోటీనిస్తున్నారు.

Update: 2025-04-27 07:26 GMT
Tollywood

Tollywood: నాని మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న కిచ్చా సుదీప్ కూతురు

  • whatsapp icon

Tollywood: స్టార్ హీరోల వార‌సులు ఇండ‌స్ట్రీకి ఎంట్రీ ఇవ్వ‌డం స‌ర్వ‌సాధార‌ణ‌మైన విష‌యం. అయితే వీరిలో పురుషుల సంఖ్యే ఎక్కువ‌గా ఉండేది. కానీ ప్ర‌స్తుతం అమ్మాయిలు కూడా అబ్బాయుల‌కు పోటీనిస్తున్నారు. ఫిల్మ్ ఇండ‌స్ట్రీలోని ర‌క‌ర‌కాల రంగాల్లో త‌మ ప్ర‌తిభ‌తో ఆక‌ట్టుకుంటున్నారు. ఈ క్ర‌మంలోనే తాజాగా మ‌రో వార‌సురాలు ఇండ‌స్ట్రీకి ఎంట్రీ ఇస్తోంది.

ప్ర‌ముఖ క‌న్న‌డ న‌టుడు కిచ్చా సుదీప్ కూతురు టాలీవుడ్‌కు ఎంట్రీ ఇస్తోంది. సుదీప్ కూతురు శాన్వి సుదీప్ ప్ర‌స్తుతం విద్య‌న‌భ్య‌సిస్తోంది. చ‌దువుతో పాటు స్పోర్ట్స్‌, ఆర్ట్స్‌లో కూడా చురుకుగా ఉంటోంది. ఆమెకు సింగింగ్ అంటే ప్రత్యేకమైన అభిరుచి ఉంది. ఇప్పటికే పాప్ సాంగ్స్ తో మంచి క్రేజ్ సాధించిన శాన్వి భవిష్యత్తులో మంచి సింగర్ అవ్వాలని ఆశపడుతుంది.

ఈ సమయంలో, ఆమె తన గొంతును న్యాచురల్ స్టార్ నాని నటిస్తున్న 'హిట్ 3' సినిమా కోసం అందించింది. నాని ఈ విషయం ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. ఈ ప్రకటనతో కిచ్చా సుదీప్ అభిమానులు ఆనందం వ్యక్తం చేశారు. శాన్వి "సరిగమప" కార్యక్రమంలో 'అప్పా ఐ లవ్ యు పా..' పాటతో ప్రత్యేక గుర్తింపు పొందింది. ఇప్పుడు, ఆమె 'హిట్ 3' సినిమా ట్రైలర్ లో వాయిస్ ఓవర్ ఇచ్చింది.

ఇదిలా ఉంటే నానికి, శాన్వికి మ‌ధ్య మంచి స్నేహం ఉంది. ఈగ సినిమా స‌మ‌యంలోనే వీరి మ‌ధ్య ప‌రిచయం ఏర్ప‌డిన‌ట్లు తెలుస్తోంది. ఈగ సినిమాలో కిచ్చా సుదీప్ విల‌న్ పాత్ర‌లో న‌టించిన విష‌యం తెలిసిందే. సినిమా సెట్స్‌లో ప‌లుసార్లు నాని, శాన్వి క‌లుసుకున్నారు. ఈ సాన్నిహిత్యంతోనే హిట్‌3కి వాయిస్ ఓవ‌ర్ ఇచ్చిన‌ట్లు స‌మాచారం.

ఇదిలా ఉంటే నాని, శ్రీనిధి శెట్టి హీరోయిన్లుగా తెర‌కెక్కిన హిట్3 ప్ర‌స్తుతం విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. మే 1వ తేదీన ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రానుంది. ఈ సినిమాపై మంచి అంచ‌నాలు ఉన్నాయి. పాన్ ఇండియా రేంజ్‌లో ఈ చిత్రాన్ని విడుద‌ల చేస్తున్నారు.



Tags:    

Similar News