Pawan Kalyan: పవన్ కళ్యాణ్ షాకింగ్ రెమ్యునరేషన్.. ఆ సినిమాకు ఏకంగా రూ. 170 కోట్లు.?

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ఈ పేరును ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. సినిమాల్లో తిరుగులేని క్రేజ్ సంపాదించుకున్న పవన్, రాజకీయాల్లోనూ తన సత్తా చాటుకున్నారు.

Update: 2025-04-26 11:13 GMT
Pawan Kalyan

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ షాకింగ్ రెమ్యునరేషన్.. ఆ సినిమాకు ఏకంగా రూ. 170 కోట్లు.?

  • whatsapp icon

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ఈ పేరును ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. సినిమాల్లో తిరుగులేని క్రేజ్ సంపాదించుకున్న పవన్, రాజకీయాల్లోనూ తన సత్తా చాటుకున్నారు. పోటీ చేసిన అన్ని స్థానాల్లో తిరుగులేని విజయం సాధించి డిప్యూటీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఇక ప్రస్తుతం అభిమానుల దృష్టి ఆయ‌న సినిమాల‌పై ప‌డింది.

ప‌వ‌న్ క‌ళ్యాణ్ సినిమా ఎప్పుడు థియేట‌ర్ల‌లోకి వ‌స్తుందా అని అంద‌రూ వేయి క‌ళ్ల‌తో ఎదురు చూస్తున్నారు. పవ‌న్ ప్ర‌స్తుతం మూడు చిత్రాల‌తో బిజీగా ఉన్నారు. హరి హర వీరమల్లు, ఓజి, ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రాలు విడుద‌ల‌కు సిద్ధంగా ఉన్నాయి. నిజానికి ప‌వ‌న్ ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించ‌క‌ముందే ఈ చిత్రాల‌కు ఓకే చెప్పారు. కాగా డేట్స్ అడ్జెస్ట్‌కాక‌పోవ‌డంతో ఈ సినిమాల విడుద‌ల వాయిదా ప‌డుతోంది.

అయితే ఇందులో ముందుగా ఓజీ ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చే అవ‌కాశాలు ఉన్నాయ‌ని తెలుస్తోంది. ముంబై అండ‌ర్ గ్రౌండ్ నేప‌థ్యంలో తెర‌కెక్కుతోన్న ఈ సినిమాపై భారీ అంచ‌నాలు ఉన్నాయి. ఇదిలా ఉంటే తాజాగా ప‌వ‌న్ రెమ్యున‌రేష‌న్‌కు సంబంధించిన ఓ వార్త సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

తాజా సమాచారం ప్రకారం, పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భ‌గత్ సింగ్ చిత్రానికి ఏకంగా 170 కోట్ల రూపాయలు రెమ్యునరేషన్‌గా తీసుకుంటున్నారని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇది తెలుగులో ఇప్పటివరకు ఏ హీరో అందుకున్న అత్యధిక రెమ్యునరేషన్ కావడం గమనార్హం. పాన్ ఇండియా స్థాయిలో కూడా చాలా మంది టాప్ హీరోలు ఈ స్థాయిలో రెమ్యునరేషన్ తీసుకోవ‌డం లేదు.

దీంతో ఇప్పుడీ వార్త ప‌వ‌న్ అభిమానుల్లో జోష్‌ని పెంచింది. ఇదిలా ఉంటే ప్ర‌స్తుతం రాజ‌కీయాల్లో బిజీగా ఉన్న ప‌వ‌న్ ఈ ఏడాది జూలై మధ్యలో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ షూటింగ్‌లో పాల్గొననున్నారని సమాచారం. మొత్తం మీద సినిమాల్లో క‌నిపించ‌క చాలా రోజులైనా ప‌వ‌న్ క్రేజ్ ఏమాత్రం త‌గ్గ‌లేద‌ని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Tags:    

Similar News