OTT Movie: న్యాయ వ్యవస్థలో లోపాలను ఎత్తి చూపే మూవీ.. స్ట్రీమింగ్ ఎందులో అంటే
OTT Movie: ఓటీటీలు అందుబాటులోకి వచ్చిన తర్వాత ఇతర భాషల సినిమాలను వీక్షించే వారి సంఖ్య పెరుగుతోంది.

OTT Movie: న్యాయ వ్యవస్థలో లోపాలను ఎత్తి చూపే మూవీ.. స్ట్రీమింగ్ ఎందులో అంటే
OTT Movie: ఓటీటీలు అందుబాటులోకి వచ్చిన తర్వాత ఇతర భాషల సినిమాలను వీక్షించే వారి సంఖ్య పెరుగుతోంది. ముఖ్యంగా మలయాళంలో మంచి విజయం అందుకున్న మూవీలో తెలుగు ప్రేక్షకులను ఎక్కువగా ఆకట్టుకుంటున్నాయి. ప్రస్తుతం జియో హాట్‌స్టార్‌లో ఇలాంటి ఓ ఆసక్తికరమైన సినిమా అందుబాటులో ఉంది. ఇంతకీ ఏంటా సినిమా.? దాని కథేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
'జలధర పంప్‌సెట్ సిన్స్ 1962. చిన్న కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. దర్శకుడు అశిష్ చిన్నప్ప అద్భుత దర్శకత్వం ఆడియన్స్‌కు బాగా నచ్చింది. కథ విషయానికొస్తే.. ఒక బావి వద్ద ఉన్న పంప్‌సెట్ మోటార్ దొంగతనం కావడం నుంచి స్టోరీ మొదలవుతుంది. ఈ చిన్న సంఘటన ఎంత పెద్ద కేసుగా మారిందో, భారతీయ న్యాయవ్యవస్థలోని లోపాలను సెటైరికల్ కామెడీతో చూపించారు.
సీనియర్ నటి ఊర్వశి ప్రధాన పాత్రలో నటించారు. ఆమె నటనకు ప్రేక్షకుల నుంచి మంచి ప్రశంసలు వచ్చాయి.
ఇందులో ఇంద్రన్స్, సనుషా, సాగర్ రాజన్, జానీ ఆంటోనీ, టీజీ రవి, విజయరాఘవన్, నిషా సారంగ్, జయన్ చేర్తలా వంటి నటులు కీలక పాత్రలు పోషించారు.
మోటార్ పంప్‌సెట్ చిన్న దొంగతనమే అయినా.. కేసు సంవత్సరాల తరబడి కోర్టుల్లో సాగుతుంది. న్యాయ వ్యవస్థలో ఎంత ఆలస్యమవుతుందన్న విషయాన్ని చూపించడమే ఈ సినిమా ముఖ్య ఉద్దేశం. చివరికి, నిజమైన న్యాయం జరగిందా లేదా అన్నది ఈ సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే. సినిమాలో కథనం చాలా సహజంగా ఉండడం, సెటైరికల్ కామెడీ టచ్, ఊర్వశి నటన, భారత న్యాయవ్యవస్థ మీద స్పష్టమైన కామెంట్ వంటివి సినిమా విజయంలో కీలక పాత్ర పోషించాయని చెప్పాలి.