Allu Arjun Birthday: అట్లీతోనే అల్లు అర్జున్ నెక్ట్స్ మూవీ.. హైప్‌తోనే చంపేసేలా ఉన్నారుగా.!
A22 x A6 Movie Announcement: పుష్ప, పుష్ప2 చిత్రాలతో ఒక్కసారిగా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ దృష్టిని తనవైపు తిప్పుకుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.

Allu Arjun Birthday: అట్లీతోనే అల్లు అర్జున్ నెక్ట్స్ మూవీ.. హైప్‌తోనే చంపేసేలా ఉన్నారుగా.!
A22 x A6 Movie Announcement: పుష్ప, పుష్ప2 చిత్రాలతో ఒక్కసారిగా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ దృష్టిని తనవైపు తిప్పుకుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ఈ సినిమాతో బన్నీ స్టామినా ఏంటో బాలీవుడ్‌కు కూడా తెలిసింది. దీంతో బన్నీ తర్వాత మూవీ ఏంటన్న దానిపై ఒక్కసారిగా అందరిలోనూ ఆసక్తి నెలకొంది. పుష్ప తర్వాత అల్లు అర్జున్ త్రివిక్రమ్‌తో ఒక సినిమా, అట్లీతో ఒక సినిమా చేయనున్నారని ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. అయితే తాజాగా బన్నీ పుట్టిన రోజు సందర్భంగా అట్లీ మూవీకి సంబంధించి అధికారిక ప్రకటన వచ్చేసింది.
అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులకు ఒక స్పెషల్ సర్‌ప్రైజ్ వచ్చేసింది. స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో బన్నీ సినిమా చేయనున్న సంగతి తాజాగా అధికారికంగా ప్రకటించారు. ఈ ప్రాజెక్ట్‌ను సన్ పిక్చర్స్ నిర్మించనుంది. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ స్వయంగా ప్రకటిస్తూ అల్లు అర్జున్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది. పుష్ప వంటి బ్లాక్ బస్టర్ తర్వాత బన్నీ, అట్లీతో కలిసి సినిమా చేస్తున్నారని అధికారికంగా ప్రకటించడంతో అందరిలో ఆసక్తి మరింతగా పెరిగింది.
ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు ఇప్పటికే మొదలయ్యాయని వెల్లడించారు. ప్రాజెక్ట్ అనౌన్స్‌మెంట్ వీడియోలో షూటింగ్‌కు సంబంధించిన ప్రాథమిక దశల దృశ్యాలను చూపించారు. హాలీవుడ్ స్థాయిలో విజువల్స్ చూపించబోతున్నట్టు పేర్కొన్నారు. విజువల్ ఎఫెక్ట్స్ కోసం అట్లీ, అల్లు అర్జున్ లాస్ ఏంజెల్స్‌లోని ప్రముఖ వీఎఫ్‌ఎక్స్ సంస్థను సంప్రదించారు. అక్కడ అల్లు అర్జున్ స్క్రీన్ టెస్ట్ చేసిన దృశ్యాలను వీడియోలో చూపించారు. వీఎఫ్‌ఎక్స్ నిపుణులు ఈ ప్రాజెక్ట్ స్క్రిప్ట్ చాలా భిన్నంగా ఉందని వ్యాఖ్యానించారు.
అట్లీ, అల్లు అర్జున్ కాంబినేషన్‌కి సంబంధించిన ఈ ప్రాజెక్ట్‌పై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రావడంతో అభిమానులు ఖుషీ అవుతున్నారు. స్క్రీనింగ్ టెస్ట్‌కు సంబంధించిన వీడియో చూస్తుంటే ఇది మాములు సినిమాలా కనిపించడం లేదు. టెక్నికల్‌గా, విజువల్‌గా కొత్త మైలురాయిని సాధించేలా ఈ సినిమా ఉండబోతోందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. చిన్న వీడియోతోనే చిత్ర యూనిట్ భారీ హైప్‌ను తీసుకొచ్చారని ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.