Upcoming Telugu Movies: హాట్‌ సమ్మర్‌లో కూల్‌ మూవీస్‌.. అటు థియేటర్‌, ఇటు ఓటీటీలో..!

Upcoming Telugu Movies: సమ్మర్‌ వచ్చిందంటే చాలు చాలా మంది సినిమాల కోసం ఎదురు చూస్తుంటారు. ప్రేక్షకులను అలరించేందుకు కొత్త సినిమాలు సిద్ధమవుతున్నాయి.

Update: 2025-04-07 06:58 GMT
Upcoming Telugu Movies: హాట్‌ సమ్మర్‌లో కూల్‌ మూవీస్‌.. అటు థియేటర్‌, ఇటు ఓటీటీలో..!
  • whatsapp icon

Upcoming Telugu Movies: సమ్మర్‌ వచ్చిందంటే చాలు చాలా మంది సినిమాల కోసం ఎదురు చూస్తుంటారు. ప్రేక్షకులను అలరించేందుకు కొత్త సినిమాలు సిద్ధమవుతున్నాయి. ఏప్రిల్‌ రెండో వారంలో థియేటర్లతో పాటు ఓటీటీలో సందడి చేసేందుకు సిద్ధమవుతున్న కొన్ని సినిమాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

జాక్‌:

డీజే టిల్లుతో పాపులారిటీ సంపాదించుకున్న సిద్ధు జొన్నలగడ్డ నటించిన చిత్రం జాక్‌. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఓ రహస్య ఆపరేషన్‌ కోసం రంగంలోకి దిగిన జాక్‌ అనే యువకుడు ఎలాంటి కష్టాలు ఎదుర్కొన్నాడు అన్న కథాంశంతో ఈ సినిమా రానుంది. ఈ నెల 10వ తేదీన ప్రేక్షకులను పలకరిచేందుకు సిద్ధమవుతోన్న ఈ సినిమాలో వైష్ణవీ చైతన్య హీరోయిన్‌గా నటించింది.

గుడ్ బ్యాడ్ అగ్లీ:

ఈ వారం థియేటర్లలో సందడి చేయనున్న మరో సినిమా గుడ్ బ్యాడ్‌ అగ్లీ. అజిత్‌, త్రిష జోడిగా తెరకెక్కిన ఈ సినిమా 10వ తేదీ ప్రేక్షకుల ముందకు రానుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌ ఈ సినిమాపై అంచనాలను పెంచేసింది.

జాట్‌:

సన్నీ దేవోల్‌ హీరోగా గోపీచంద్‌ మలినేని తెరకెక్కించిన చిత్రం ‘జాట్‌’. ఈ సినిమాను 10వ తేదీన విడుదల చేసేందుకు చిత్ర యూనిట్‌ సన్నాహాలు చేస్తోంది. సయామీ ఖేర్‌, రెజీనా హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి.

అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి:

ఈ వారం ప్రేక్షకులను అలరించేందుకు వస్తున్న మరో చిత్రం అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి. యాంకర్‌ ప్రదీప్‌ హీరోగా నటించిన రెండో సినిమా ఇది. సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌ దీపికహీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా ప్రేక్షకుల ఏ మేర ఆకట్టుకుంటుందో చూడాలి.

కౌసల్య తనయ రాఘవ:

రాముడు, రావణుడు కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 11వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. రాజేశ్‌ కొంచాడా, శ్రావణి శెట్టి జంటగా.. స్వామి పట్నాయక్‌ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది.

ఓటీటీలో:

ఇక ఓటీటీలో కూడా ఈ వారం మంచి సినిమాలు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నాయి. వీటిలో కొన్నింటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

నెట్‌ఫ్లిక్స్‌:

పెరుసు: ఏప్రిల్‌ 11 (తెలుగులోనూ), కిల్‌ టోనీ (వెబ్‌సిరీస్‌): ఏప్రిల్‌ 7 (ఇంగ్లిష్‌), బ్లాక్‌ మిర్రర్‌ 7 (వెబ్‌సిరీస్‌): ఏప్రిల్‌ 10 (ఇంగ్లిష్‌), ఫ్రోజెన్‌ హాట్‌ బాయ్స్‌: ఏప్రిల్‌ 10 (ఇంగ్లిష్‌) స్ట్రీమింగ్‌ కానున్నాయి.

ఈటీవీ విన్‌:

లైఫ్‌ పార్ట్‌నర్‌: స్ట్రీమింగ్‌ అవుతోంది (తెలుగు), ఉత్తరం: స్ట్రీమింగ్‌ అవుతోంది (తెలుగు), టుక్‌ టుక్‌: ఏప్రిల్‌ 10 (తెలుగు) నుంచి అందుబాటులోకి రానున్నాయి.

సోనీలివ్‌:

ప్రావింకూడు షాపు: ఏప్రిల్‌ 11 (తెలుగులోనూ) నుంది స్ట్రీమింగ్ కానుంది.

అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో:

ఛోరీ 2: ఏప్రిల్‌ 11 (హిందీ) సినిమా ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది.

జియో హాట్‌స్టార్‌:

ది లెజెండ్‌ ఆఫ్‌ హనుమాన్‌ 6 (యానిమేషన్‌ సిరీస్‌): ఏప్రిల్‌ 11 (హిందీ)వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది. 

Tags:    

Similar News