Sikandar Box Office Collection Day 1: దారుణం.. సల్మాన్ సికిందర్ తొలి రోజు కలెక్షన్లు ఎంతో తెలుసా.?
Sikandar Box Office Collection Day 1: బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ హీరోగా, కోలీవుడ్ దర్శకుడు ఏఆర్ మురుగదాస్ తెరకెక్కించిన భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘సికందర్’.

Sikandar Box Office Collection Day 1: దారుణం.. సల్మాన్ సికిందర్ తొలి రోజు కలెక్షన్లు ఎంతో తెలుసా.?
Sikandar Box Office Collection Day 1: బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ హీరోగా, కోలీవుడ్ దర్శకుడు ఏఆర్ మురుగదాస్ తెరకెక్కించిన భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘సికందర్’. రంజాన్ కానుకగా మార్చి 30న విడుదలైందీ సినిమా. రష్మిక మందన్నా ఇందులో హీరోయిన్‌గా నటించింది. భారీ అంచనాల నడుమ బాక్సాఫీస్ వద్ద విడుదలైన ఈ సినిమా తొలి కేవలం రూ. 26 కోట్లు వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
సల్మాన్ ఖాన్ గత సినిమా ‘టైగర్ 3’ తో పోల్చితే ఈ సినిమా తొలి రోజు వసూళ్లు తగ్గాయని చెప్పాలి. సల్మాన్ ఖాన్ కెరీర్‌లో అత్యధిక ఓపెనింగ్స్ సాధించిన టాప్ 10 చిత్రాల జాబితాలో ‘సికందర్’ 8వ స్థానంలో ఉంది. మరోవైపు, సినిమా విడుదలకు ముందే లీక్ కావడం దీనిపై ప్రభావం చూపినట్లు సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సినిమా రిలీజ్‌కు ముందే ‘సికందర్’ ఆన్లైన్‌లో లీక్ కావడం బాలీవుడ్‌లో చర్చనీయాంశమైంది.
శనివారం రాత్రి అనేక వెబ్‌సైట్లలో ఈ మూవీ అందుబాటులోకి వచ్చిందని. ఓ ఫిల్మ్ క్రిటిక్ సోషల్ మీడియాలో ఈ విషయాన్ని వెల్లడించడంతో అది వైరల్ అయ్యింది. దీంతో నిర్మాతలు తక్షణమే స్పందించి సంబంధిత అధికారులను కోరారు. ప్రస్తుతం దీనిపై దర్యాప్తు కొనసాగుతోంది.
సికిందర్ తొలి రోజు కలెక్షన్స్ ఆశించిన స్థాయిలో రాలేవని చెప్పాలి. అయితే సల్మాన్ ఖాన్ స్టార్‌డమ్, ఈద్ సెలబ్రేషన్స్, మురుగదాస్ మాస్ మేకింగ్ కలిసొస్తే రూ. 100 కోట్ల క్లబ్‌లో చేరే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇక ఈ సినిమా కథ విషయానికొస్తే.. సల్మాన్ ఖాన్ ఓ ఇంటెలిజెన్స్ ఆఫీసర్‌గా, దేశ రక్షణ కోసం శత్రువులపై యుద్ధం చేసే పాత్రలో నటించారు. భారీ యాక్షన్ ఎపిసోడ్స్, మాస్ ఎలిమెంట్స్ తో మురుగదాస్ స్టైల్‌లో తెరకెక్కిన ఈ సినిమా సల్మాన్ ఫ్యాన్స్‌ను నచ్చుతుంది. అయితే విడుదలకు ముందే సినిమా లీక్ కావడం కలెక్షన్లపై ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి.