OTT: ఆహాలో ఇంట్రెస్టింగ్‌ థ్రిల్లర్‌ మూవీ.. స్ట్రీమింగ్‌ ఎప్పటి నుంచంటే

OTT: ఆనంది, వరలక్ష్మి శరత్‌కుమార్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం శివంగి. ఉమెన్‌ సెంట్రిక్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ థ్రిల్లర్‌ మూవీకి దేవరాజ్ భరణి ధరణ్ దర్శకత్వం వహించారు.

Update: 2025-04-17 09:02 GMT
OTT

OTT: ఆహాలో ఇంట్రెస్టింగ్‌ థ్రిల్లర్‌ మూవీ.. స్ట్రీమింగ్‌ ఎప్పటి నుంచంటే

  • whatsapp icon

OTT: ఆనంది, వరలక్ష్మి శరత్‌కుమార్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం శివంగి. ఉమెన్‌ సెంట్రిక్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ థ్రిల్లర్‌ మూవీకి దేవరాజ్ భరణి ధరణ్ దర్శకత్వం వహించారు. ఇటీవలే థియేటర్లలో విడుదలై పాజిటివ్‌ టాక్‌ సొంతం చేసుకున్న ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో సందడి చేసేందుకు వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది.

ఈ సినిమాను భవానీ మీడియా ఓటీటీ ప్లాట్‌ఫారంపై అందుబాటులోకి తీసుకువచ్చింది. తెలుగు వెర్షన్ గురువారం నుంచి స్ట్రీమింగ్ అవుతుండగా, తమిళ వెర్షన్ శనివారం నుంచి ప్రసారం కానుంది. ఈ థ్రిల్లర్ మూవీ ఆద్యంతం ఉత్కంఠను కలిగించే కథనంతో సాగుతుంది. ఆనంది, వరలక్ష్మి శరత్‌కుమార్‌లు తమ అద్భుత నటనతో ప్రేక్షకులను మెస్మరైజ్‌ చేశారు. ముఖ్యంగా ఈ ఇద్దరి పాత్రలు ఎంతో బలంగా ఉండడం వల్ల కథకు మరింత బలాన్నిచ్చాయి.

ఈ చిత్రంలో జాన్ విజయ్, డాక్టర్ కోయ కిషోర్ వంటి నటులు ముఖ్యమైన పాత్రల్లో కనిపించి తమదైన ముద్ర వేశారు. ఇక టెక్నికల్ హైలైట్స్ విషయానికొస్తే.. స్క్రీన్ ప్లే చాలా గ్రిప్పింగ్‌గా ఉండి, ప్రేక్షకులను చివరి వరకు హోల్డ్ చేయగలిగింది. బీజీఎమ్, విజువల్స్ థ్రిల్లింగ్ ఎఫెక్ట్‌కు సరిపోయేలా ఉన్నాయి. మంచి బడ్జెట్‌తో సినిమాను నాణ్యతతో నిర్మించారు. థ్రిల్లర్‌ మూవీలను ఇష్టపడే వారికి శివంగి బెస్ట్‌ ఆప్షన్‌గా చెప్పొచ్చు. మరెందుకు ఆలస్యం ఆహాలో స్ట్రీమ్‌ అవుతోన్న ఈ థ్రిల్లర్‌ మూవీపై మీరూ ఓ లుక్కేయండి.

Tags:    

Similar News