Jagamerigina Satyam Review: జగమెరిగిన సత్యం.. పల్లె గుండె చుట్టూ అల్లుకున్న భావోద్వేగాల కథ!
Jagamerigina Satyam: తెలంగాణ పల్లె అందాలను, అక్కడి మనుషుల స్వచ్ఛమైన మనసులను తెరపై ఆవిష్కరించే ప్రయత్నంతో రూపొందిన చిత్రం 'జగమెరిగిన సత్యం'.

Jagamerigina Satyam Review: జగమెరిగిన సత్యం.. పల్లె గుండె చుట్టూ అల్లుకున్న భావోద్వేగాల కథ!
మూవీ రివ్యూ: జగమెరిగిన సత్యం
నటీనటులు: అవినాష్ వర్మ, ఆద్యా రెడ్డి, నీలిమ
దర్శకుడు: తిరుపతి పాలె
సంగీత దర్శకుడు: సురేష్ బొబ్బిలి
ట్రైలర్ ఎడిటర్: ఉప్పు మారుతి
డీఓపీ: షోయబ్
నిర్మాత: విజయ భాస్కర్
ఎడిటర్: అమర్ రెడ్డి కుడుముల
బ్యానర్: అమృత సత్యనారాయణ క్రియేషన్స్
డిజిటల్ మార్కెటింగ్: బిగ్ ఫిష్ మీడియా
రేటింగ్ : 2.75/5
Jagamerigina Satyam: తెలంగాణ పల్లె అందాలను, అక్కడి మనుషుల స్వచ్ఛమైన మనసులను తెరపై ఆవిష్కరించే ప్రయత్నంతో రూపొందిన చిత్రం 'జగమెరిగిన సత్యం'. పేరుకు తగ్గట్టే ఇది కేవలం ఒక కథ కాదు, తెలంగాణ నేల స్వభావాన్ని, అక్కడి జీవితంలోని నిజాయితీని ప్రతిబింబిస్తుంది. దర్శకుడు తిరుపతి పాలె తన తొలి ప్రయత్నంలోనే తెలంగాణ పల్లెటూరి హృదయాన్ని ముళ్లపూడి మట్టిలో చూపించే ప్రయత్నం చేశారు.
కథ :
ఇది తెలంగాణలోని ఒక చిన్న ఊరిలో జీవిస్తున్న సత్యం అనే యువకుడి జీవితం చుట్టూ తిరుగుతుంది. పైకి సాదాసీదాగా కనిపించే అతని జీవితంలో ఆత్మవిశ్వాసం, ప్రేమ, బాధ, త్యాగం వంటి ఎన్నో భావోద్వేగాలు దాగి ఉన్నాయి. సత్యం పాత్ర ద్వారా ఒక ఊరి కథను, ఆ భూమి మనసును ఆవిష్కరించే ప్రయత్నం చేశారు. సత్యంతో ముడిపడిన ప్రతి పాత్ర మనకు ఎక్కడో తారసపడినట్టుగానే ఉంటుంది. చిన్న చినమ్మతో అతని అనుబంధం, ఊరి రాజకీయాలు, మనిషి విలువలపై వచ్చే సవాళ్లు వంటి అంశాలు కథను బలంగా నడిపిస్తాయి.
సినిమా మొదటి భాగం తెలంగాణ పల్లెటూరి వాతావరణాన్ని, భాషను, ఆచారాలను కళ్లకు కట్టినట్టు చూపిస్తుంది. చిన్న చిన్న సన్నివేశాల్లోనూ హృదయాన్ని తాకే భావోద్వేగాలు ఉంటాయి. సహజమైన పల్లె హాస్యం కూడా ప్రేక్షకులను నవ్విస్తుంది. ఇక రెండో భాగంలో కథ మరింత భావోద్వేగభరితంగా మారుతుంది. సత్యం జీవితంలో ఎదురైన కష్టాలు, అతను నమ్మిన విలువలు, చివరికి ఊరిని కొత్త దిశగా నడిపించే అతని ప్రయత్నం అద్భుతంగా చూపించారు.
క్లైమాక్స్‌లో వచ్చే భావోద్వేగాల పరాకాష్ట సినిమాకు ఒక గుండె లాంటిది. సత్యం బాధపడినప్పుడు ప్రేక్షకులు కూడా తమ మనసుల్లో బరువెక్కుతుంది. అంత బలమైన భావోద్వేగంతో సినిమా ముగుస్తుంది. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ థియేటర్ నుండి కనీసం రెండు కన్నీటి చుక్కలతో బయటకు వస్తారనడంలో సందేహం లేదు.
విశ్లేషణ :
'జగమెరిగిన సత్యం' ఒక కళ్లెదుట జరిగినట్టుండే జీవిత కథనం. ఇందులో గ్లామర్ లేకపోవచ్చు కానీ నిజాయితీ ప్రతి సన్నివేశంలోనూ కనిపిస్తుంది. కథ, పాత్రలు, నటన, సినిమాటోగ్రఫీ అన్నీ సహజంగా ఉంటాయి. సినిమాలో ప్రతి పాత్రలో మన ఊరి మనిషి కనిపిస్తాడు.
హీరో రవితేజ మేనల్లుడు అవినాష్ వర్మ ఈ సినిమాతో పరిచయం కావడం విశేషం. దర్శకుడు తిరుపతి పాలె తొలి సినిమాతోనే మంచి పేరు తెచ్చుకునేలా పనిచేశారు. కొత్త వారిని నమ్మి నిర్మాతలు ఆచా విజయ భాస్కర్ బాగానే ఖర్చు పెట్టారు. నిర్మాణ విలువలు ఎక్కడా తగ్గలేదని సినిమా చూస్తే తెలుస్తుంది. సురేష్ బొబ్బిలి సంగీతం కథకు తగ్గట్టుగా ఉంది.
ప్లస్ పాయింట్స్:
తెలంగాణ మట్టిని కళ్లకు కట్టేలా విజువల్స్
సత్యం పాత్రలో అవినాష్ వర్మ భావోద్వేగ ప్రదర్శన
కథనంలో ఎక్కడా పెట్టిన సీన్ల మాదిరి లేకపోవడం
చిన్న చినమ్మ పాత్ర హత్తుకునేలా ఉండటం
సహజమైన డైలాగులు, ఎమోషనల్ రైటింగ్
మైనస్ పాయింట్స్:
కొన్ని చోట్ల కాస్త నెమ్మదిగా సాగిన కథనం
కొన్ని పాత్రలకు మరింత లోతు ఉంటే బాగుండేది
చివరిగా:
'జగమెరిగిన సత్యం' కేవలం ఒక సినిమా కాదు, ఇది మన ఊరిని, మన భూమిని, మన మనిషిని తట్టిలేపే ఒక అనుభూతి. ఇది చూడాల్సింది కాదు, అనుభవించాల్సింది. భావోద్వేగాలు, సంస్కృతి, ప్రేమ, త్యాగం కలగలిసిన ఒక స్వచ్ఛమైన కథ ఇది.