Chaurya Paatam: ఇంతకీ వాళ్లు ఆ బ్యాంకును చోరీ చేశారా లేదా? ఆసక్తికరంగా 'చౌర్య పాఠం' ట్రైలర్

దొంగతనాలకు సంబంధించిన చిత్రాలు ఇప్పటి వరకు చాలా వచ్చాయి. హాలీవుడ్ మొదలు, టాలీవుడ్ వరకు ఈ కాన్సెప్ట్‌తో వచ్చిన చిత్రాలన్నీ మంచి విజయాలను అందుకున్నాయి. తాజాగా ఇదే జోనర్‌లో తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది చౌర్య పాఠం. ధమాకా, మజాకా లాంటి హిట్ చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు త్రినాథరావు నక్కిన మొదటిసారి నిర్మాతగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.
క్రైమ్-కామెడీ డ్రామా చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమాలో ఇంద్రా రామ్ హీరోగా టాలీవుడ్‌కు పరిచమయ్యారు. కన్నడ నటిగా గుర్తింపు పొందిన పాయల్ రాధాకృష్ణ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. యువ దర్శకుడు నిఖిల్ గొల్లమారి ఈ సినిమాతో మెగాఫోన్ పట్టారు. రాజీవ్ కనకాల, మస్త్ అలీ వంటి అనుభవజ్ఞులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. నక్కిన నెరేటివ్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి విడుదలైన పాటలకు ఇప్పటికే మంచి స్పందన లభించింది.
తాజాగా విడుదలైన థియేట్రికల్ ట్రైలర్ మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది. ధనపల్లి అనే ఊరిలో ఓ బ్యాంక్ దోచేందుకు ప్లాన్ వేసిన ముఠా వారికి ఎదురైన పరిస్థితులే ఈ చిత్రంలోని కథాంశం. చౌర్య పాఠం అనే టైటిల్‌కు తగ్గట్టుగా ఈ సినిమా మొత్తం ఒక బ్యాంకు దొంగతనం చుట్టూ తిరుగుతుంది. ట్రైలర్‌లో వినోదం, థ్రిల్ రెండూ సమపాళ్లలో కనిపిస్తున్నాయి. హీరో ఇంద్రా రామ్ స్క్రీన్ ప్రెజెన్స్, ఎక్స్‌ప్రెషన్స్, డైలాగ్ డెలివరీతో ఆకట్టుకున్నారు. పేరుకు తొలి సినిమానే అయినా అనుభవం ఉన్న నటుడిలా కనిపించారు.
సంగీత దర్శకుడు డేవ్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు అదనపు బలంగా నిలుస్తోంది. టెక్నికల్‌గా కూడా మంచి స్టాండర్డ్స్ పాటించినట్టు ట్రైలర్ చూస్తే స్పష్టమవుతోంది. సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమాకు యు/ఏ సర్టిఫికెట్ లభించింది. ఈ సినిమాను తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఏప్రిల్ 25న విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. మరి ట్రైలర్‌తో అంచనాలు పెంచేసిన ఈ మూవీ థియేటర్లలో ప్రేక్షకులను ఏమేర ఆకట్టుకుంటుందో చూడాలి.