Odela 2 Movie Review: అఘోరీగా తమన్న విశ్వరూపం.. ఓదెల 2 ఎలా ఉంది.?

Odela 2 Movie Review: తమన్నా ప్రధాన పాత్రలో నటించిన ‘ఓదెల 2’ చిత్రం ప్రేక్షకుల ముందుకు ఏప్రిల్ 17న వచ్చింది. గతంలో ఓటిటీలో రిలీజై మంచి స్పందన పొందిన ‘ఓదెల రైల్వే స్టేషన్’కి సీక్వెల్‌గా ఈ సినిమాను తెరకెక్కించారు.

Update: 2025-04-17 08:16 GMT
Odela 2 Movie Review

Odela 2 Movie Review: అఘోరీగా తమన్న విశ్వరూపం.. ఓదెల 2 ఎలా ఉంది.?

  • whatsapp icon

మూవీ రివ్యూ: ఓదెల 2

నటీనటులు: తమన్నా భాటియా, వశిష్ట ఎన్ సింహా, హెబ్బా పటేల్, మురళీ శర్మ, దయానంద్ రెడ్డి, శ్రీకాంత్ అయ్యంగార్ తదితరులు

ఎడిటర్: అవినాష్

సినిమాటోగ్రఫీ: సౌందరరాజన్

సంగీతం: అజినీష్ లోక్‌నాథ్

కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వ పర్యవేక్షణ: సంపత్ నంది

దర్శకుడు: అశోక్ తేజ

నిర్మాత: డి మధు

రేటింగ్: 3/5

తమన్నా ప్రధాన పాత్రలో నటించిన ‘ఓదెల 2’ చిత్రం ప్రేక్షకుల ముందుకు ఏప్రిల్ 17న వచ్చింది. గతంలో ఓటిటీలో రిలీజై మంచి స్పందన పొందిన ‘ఓదెల రైల్వే స్టేషన్’కి సీక్వెల్‌గా ఈ సినిమాను తెరకెక్కించారు. అశోక్ తేజ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు రచన, డైరెక్షన్ సూపర్విజన్ అన్నీ సంపత్ నంది అందించారు. కొత్త నిర్మాత మధు నిర్మించిన ఈ చిత్రంపై విడుదలకు ముందు నుంచే మంచి అంచనాలు నెలకొన్నాయి. ఫస్ట్ పార్ట్‌కు క్రేజ్ ఉండటంతో పాటు ప్రమోషన్స్ కూడా ఆకర్షణీయంగా ఉండటంతో ప్రేక్షకుల్లో ఈ సినిమాపై క్యూరియాసిటీ ఏర్పడింది.

కథ ఏంటంటే.?

ఈ కథ మొదటి భాగం ముగిసిన దగ్గర నుంచి మొదలవుతుంది. తిరుపతి (వశిష్ట సింహ) అనే కామాంధుడిని అతని భార్య రాధా (హెబ్బా పటేల్) అతని నేరాలు తెలుసుకుని తల నరికి చంపేస్తుంది. దీంతో ఆమె జైలుకు వెళ్తుంది. తిరుపతి శవాన్ని ఊరివాళ్లు సమాధి శిక్ష విధిస్తారు. ఆత్మకు శాంతి లేకుండా చేస్తారు. ఆ శాపం వల్ల తిరుపతి ఆత్మ ఊరిలో ప్రేతాత్మగా మిగిలిపోతుంది. మళ్లీ అక్కడ జరిగే పెళ్లిళ్లలో, కొత్తగా వివాహితలపై దాడి చేసి, వారిని శోభనం రాత్రే హత్య చేయడం ప్రారంభిస్తాడు.

అందులో మాయన్న, పూజారి వంటి కొన్ని పాత్రలపై అనుమానం పెరుగుతుంది. కానీ అల్లా భక్షు (మురళీ శర్మ) తెలిపిన ప్రకారం, ఇదంతా తిరుపతి ఆత్మ కారణంగా జరుగుతోందని తెలుస్తుంది. పరిష్కారంగా, రాధ తన అక్క భైరవి (తమన్నా) గురించి చెబుతుంది. చిన్నతనంలోనే అఘోరిగా మారిన ఆమె, ఆ ఊరిని కాపాడగలదని భావించి ఊరివాళ్లు ఆమెను తీసుకువస్తారు. ఆ తర్వాత ఏం జరిగింది.? భైరవి, ప్రేతాత్మను ఎలా అంతమొందించింది అన్న విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

ఎలా ఉందంటే.?

సినిమాలోని కథ కాస్త రోటిన్‌గా అనిపించినా దర్శకుడు దాన్ని థియేట్రికల్‌గా ఎఫెక్టివ్‌గా చూపించే ప్రయత్నం చేశాడు. మొదటి భాగం తెలియని వాళ్లకు కొంత క్లారిటీ అవసరం కానీ, కథనం ఆ డౌట్‌ను తొలగించగలిగింది. ఫస్ట్ హాఫ్‌లో కథ నెమ్మదిగా సాగుతుంది. ముఖ్యంగా కథను బిల్డ్ చేయడంలో ఎక్కువ సమయం తీసుకున్నట్టుంది. అయితే ఇంటర్వెల్ సీన్ దగ్గర తమన్నా ఎంట్రీతో సినిమాలో ఉత్కంఠ పెరుగుతుంది. ఆమె స్క్రీన్ మీద ఉన్నంతసేపు విజువల్‌గా, ఎమోషనల్‌గా కూడా సినిమా బలంగా అనిపిస్తుంది.

సెకండ్ హాఫ్‌లో ప్రేతాత్మతో ఆమె తలపడే సన్నివేశాలు కొంతవరకు రొటీన్‌గా ఉన్నా, కొన్ని విజువల్స్, థీమ్, స్కోర్ సినిమాను నిలబెట్టాయి. క్లైమాక్స్ ఎపిసోడ్ థియేటర్లో ఓ మంచి ఎమోషన్‌ను తీసుకొచ్చింది. తమన్నా ఈ సినిమాలో అఘోరి పాత్రలో అద్భుతంగా నటించింది. వశిష్ట సింహ ప్రేతాత్మగా మెప్పించాడు. అతడి మేకోవర్, నటన మంచి ఇంటెన్సిటీగా ఉన్నాయి. హెబ్బా పటేల్ పాత్ర పరిమితిగా ఉన్నా తన పరిధిమేరకు అద్భుతంగా నటించింది. మురళీ శర్మ, శ్రీకాంత్ అయ్యంగార్, ఇతర పాత్రధారులు బాగా సపోర్ట్ అయ్యారు.

టెక్నికల్ ఎలిమెంట్స్:

బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ – అజనీష్ లోక్‌నాథ్ ఇచ్చిన మ్యూజిక్ సినిమాకు మెయిన్ ప్లస్ పాయింట్‌గా చెప్పొచ్చు విజువల్స్ రిచ్‌గా కనిపించాయి. ముఖ్యంగా క్లైమాక్స్‌లో శివుడిని చూపించిన తీరు బాగుంది. విఎఫ్ఎక్స్ కూడా బాగున్నాయి. డైలాగ్స్ ఆకట్టుకుంటాయి.

Tags:    

Similar News