Arjun S/O Vyajayanthi Review: అర్జున్ సన్నాఫ్‌ వైజయంతి - మాస్ ప్రేక్షకులను మెప్పించే యాక్షన్ డ్రామా!

Arjun S/O Vyjayanthi Review: కళ్యాణ్ రామ్ గత కొలంగా సరైన హిట్ లేక ఇబ్బంది పడుతున్నాడు. దీంతో ఎంతో ప్రతిష్టాత్మకంగా నటించిన యాక్షన్ ప్యాక్డ్ ఫ్యామిలీ డ్రామా ‘అర్జున్ సన్నాఫ్‌ వైజయంతి’ (Arjun S/O Vyjayanthi).

Update: 2025-04-18 06:25 GMT
Arjun S/O Vyjayanthi Movie Review in Telugu

Arjun S/O Vyajayanthi Review : అర్జున్ సన్నాఫ్‌ వైజయంతి - మాస్ ప్రేక్షకులను మెప్పించే యాక్షన్ డ్రామా!

  • whatsapp icon

Arjun S/O Vyjayanthi Review: కళ్యాణ్ రామ్ గత కొలంగా సరైన హిట్ లేక ఇబ్బంది పడుతున్నాడు. దీంతో ఎంతో ప్రతిష్టాత్మకంగా నటించిన యాక్షన్ ప్యాక్డ్ ఫ్యామిలీ డ్రామా ‘అర్జున్ సన్నాఫ్‌ వైజయంతి’ (Arjun S/O Vyjayanthi). కళ్యాణ్ రామ్ తల్లిగా విజయశాంతి చాలా కాలం తర్వాత ఓ కీలక పాత్రలో నటించారు. ప్రదీప్ చిలుకూరి దర్శకుడు. అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లపై అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ రోజు విడుదల అయిన ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.

కథ:

అర్జున్ సన్నాఫ్‌ వైజయంతి చిత్రం తల్లి కొడుకుల అనుబంధం చుట్టూ తిరుగుతుంది. దీనికి యాక్షన్, ఎమోషన్ కలగలిపారు. వైజయంతి ఒక నిజాయితీగల పోలీస్ ఆఫీసర్. తన కొడుకు అర్జున్ కూడా తనలాగే సిన్సియర్ ఐపీఎస్ అధికారి కావాలని కోరుకుంటుంది. కానీ, అనుకోకుండా ఒక మాఫియా డాన్‌తో అర్జున్‌కు ఎదురైన సంఘటన అతనిని మరో దారిలోకి తీసుకెళ్తుంది.

అర్జున్‌కు నేరస్థుడు కావాలనే ఉద్దేశం లేకపోయినా, ప్రజలను రక్షించడానికి స్థానిక మాఫియాతో పోరాడే ఒక అప్రకటిత వీరుడిగా మారతాడు. ఇది అతని తల్లికి నచ్చదు. ఆమె అతని పద్ధతులను వ్యతిరేకిస్తూ అతని నుండి దూరంగా ఉంటుంది. అర్జున్ తర్వాత ఒక కార్మిక కాలనీకి వెళ్తాడు. చివరికి వైజాగ్‌లో టాప్ గ్యాంగ్‌స్టర్‌గా ఎదుగుతాడు. కాకపోతే తను సమాజ సంక్షేమం కోసం పోరాడే గ్యాంగ్‌స్టర్‌ అవుతాడు.

శ్రీకాంత్ పోషించిన కొత్త పోలీస్ కమిషనర్ వైజాగ్‌కు వచ్చిన తర్వాత కథ మరింత ఆసక్తికరంగా మారుతుంది. పవర్ ఫుల్ గ్యాంగ్‌స్టర్ ఎవరో కాదు, మాజీ పోలీస్ అధికారి వైజయంతి కుమారుడని అతను గుర్తిస్తాడు. మరోవైపు, వైజయంతి అర్జున్‌ను లొంగిపోయి చట్టపరమైన మార్గంలో నడవమని పదే పదే చెబుతూ ఉంటుంది. ఆ తర్వాత అర్జున్ తల్లి మాట వింటాడా, ఐపీఎస్ అవుతాడా అనేది సినిమాలో చూడాలి. వైజాగ్ ప్రజలను రక్షించే తన లక్ష్యం, తల్లికి మధ్య అర్జున్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో తెర మీదే చూడాలి.

విశ్లేషణ:

అర్జున్ సన్నాఫ్ వైజయంతి సినిమా ఆసక్తికరంగా ప్రారంభమవుతుంది. దర్శకుడు మాస్ యాక్షన్ సన్నివేశాలను బాగా తెరకెక్కించాడు. ఫస్ట్ పార్ట్ చాలా బాగుంది. పాత్రలు నిజాయితీగా అనిపిస్తాయి. అయితే, సినిమా రెండో భాగంలోకి వెళ్ళేకొద్దీ, కథనం పాత పద్ధతిలో సాగుతుంది. మొదట్లో మాస్ యాక్షన్ బ్లాక్‌లు ముగిసిన తర్వాత, కథ చెప్పడంలో కొత్తదనం, క్రియేటివిటీ తగ్గుతుంది.

క్లైమాక్స్ కొంతవరకు ప్రేక్షకులకు కాస్త ఫర్వాలేదనిపిస్తుంది. ఇందులో మాస్ ప్రేక్షకులను మెప్పించే ఒక చిన్న షాక్ ఎలిమెంట్ ఉంది. సినిమాలో ఒక మాస్ సాంగ్, మరో రెండు పాటలు ఉన్నాయి. కానీ అవి ఎక్కువ కాలం గుర్తుండిపోయే విధంగా ఏం లేవు. అజనీష్ లోక్‌నాథ్ నేపథ్య సంగీతం బాగుంది. హీరోయిక్ సన్నివేశాలను ఎలివేట్ చేసే విధంగా ఉంది.

మొత్తం మీద, సినిమాలో కొన్ని మాస్ అప్పీల్ ఉన్న సీన్స్ ఉన్నప్పటికీ, క్లాస్ ప్రేక్షకులకు ఇది పెద్దగా నచ్చకపోవచ్చు. యంగ్ ఆడియన్స్ కూడా దీనికి భిన్నంగా స్పందించవచ్చు. కళ్యాణ్ రామ్ అభిమానులు, నందమూరి అభిమానులు లేదా మాస్ మూవీ లవర్స్‌కు ఇది కొంతవరకు నచ్చుతుంది. అయితే, కంటెంట్ డ్రివెన్ లేదా స్టైలిష్ కథనాన్ని ఇష్టపడేవారు దీనిని మామూలు చిత్రంగానే భావిస్తారు.

నిర్మాణం, దర్శకత్వం :

ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. సినిమాలో నటించిన నటీనటులంతా తమ పాత్ర మేరకు నటించారు. అందుకు తగిన బడ్జెట్ ఉన్నట్లు అనిపించింది. దర్శకుడు ప్రదీప్ చిలుకూరి మాస్ యాక్షన్ సీన్లను తీయడంతో తన టాలెంట్ చూపించాడు. కానీ రైటింగ్ డిపార్టుమెంటులో లోపం కనిపిస్తుంది. కథనం పాతగా ఉండటం ప్రధాన లోపం.

నటీనటుల పర్ఫామెన్స్:

కళ్యాణ్ రామ్ అర్జున్‌గా బాగా నటించాడు, వైజయంతిగా విజయశాంతి అద్భుతంగా నటించింది. ఇద్దరూ ఎమోషనల్, యాక్షన్ సన్నివేశాల్లో చక్కగా నటించారు. సాయి మంజ్రేకర్ అర్జున్ భార్య చిత్ర పాత్రను పోషించింది. కానీ ఆమె పాత్ర చాలా పరిమితం. సోహైల్ ఖాన్ పఠాన్‌గా కాస్త బలంగా ఉంటే బాగుండేది అనిపించింది. శ్రీకాంత్‌కు కమిషనర్‌గా మంచి పాత్ర లభించింది. అతను బాగా నటించాడు. పృథ్వి, ఇతరత్రాల పాత్రలు కూడా ఫర్వాలేదనిపించాయి.

ప్లస్ పాయింట్లు:

క్లైమాక్స్, ఇంటర్వెల్ తర్వాత యాక్షన్ బ్లాక్

కొన్ని ఆకట్టుకునే యాక్షన్ సీన్స్

కళ్యాణ్ రామ్, విజయశాంతి నటన

తల్లి - కొడుకు అనుబంధం

మైనస్ పాయింట్లు:

పాత కథనం

మంచి పాటలు లేకపోవడం

ఎక్కువ యాక్షన్

చివరగా :

అర్జున్ S/O వైజయంతి మాస్ ప్రేక్షకులను కొంతవరకు ఆకట్టుకుంటుంది. క్లైమాక్స్ కొంత హైప్ తీసుకొచ్చినప్పటికీ ఊహాజనిత కథనం మొత్తం ఆ ఫీలింగ్ పోగొడుతుంది. కొన్ని యాక్షన్ సీన్స్ బాగున్నాయి. వాటిని పాత కథనం వెనక్కి లాగినట్లు అనిపిస్తుంది. మొత్తానికి, మాస్ లేదా రెగ్యులర్ యాక్షన్ సినిమాలు ఇష్టపడే వారు ఒకసారి చూడొచ్చు.

రేటింగ్: 3/5

తారాగణం: నందమూరి కళ్యాణ్ రామ్, విజయశాంతి, సోహైల్ ఖాన్, సాయి మంజ్రేకర్, మేకా శ్రీకాంత్

దర్శకుడు: ప్రదీప్ చిలుకూరి

నిర్మాతలు: అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు

సంగీతం: బి. అజనీష్ లోక్‌నాథ్

Tags:    

Similar News