Viral Photo: 'బంటీ నీ సబ్బు స్లోనా ఏంటీ'.. ఈ క్యూట్ గర్ల్ ఇప్పుడెలా మారిందో తెలుసా? షాక్ అవ్వాల్సిందే
Viral Photo: చైల్డ్ ఆర్టిస్టులుగా కెరీర్ మొదలు పెట్టి స్టార్‌లుగా మారిన వారు ఎంతో మంది ఉన్నారు. అయితే కేవలం సినిమాలు మాత్రమే కాకుండా ప్రకటనల్లో నటించి కూడా మంచి పేరు సంపాదిచుకున్న వారు ఉన్నారు.

Viral Photo: 'బంటీ నీ సబ్బు స్లోనా ఏంటీ'.. ఈ క్యూట్ గర్ల్ ఇప్పుడెలా మారిందో తెలుసా? షాక్ అవ్వాల్సిందే
Viral Photo: చైల్డ్ ఆర్టిస్టులుగా కెరీర్ మొదలు పెట్టి స్టార్‌లుగా మారిన వారు ఎంతో మంది ఉన్నారు. అయితే కేవలం సినిమాలు మాత్రమే కాకుండా ప్రకటనల్లో నటించి కూడా మంచి పేరు సంపాదిచుకున్న వారు ఉన్నారు. అలాంటి వారిలో అవనీత్ కౌర్ ఒకరు. ఈ పేరు కంటే 'బంటీ నీ సబ్బు స్లోనా ఏంటీ' అనే డైలాగ్ చెబితే టక్కున ఓ చిన్నారి గుర్తొస్తుంది. సబ్బు యాడ్‌లో తన ముద్దు ముద్దు డైలాగ్‌తో అప్పట్లో ప్రేక్షకులను ఆకట్టుకున్న చిన్నారి, ఇప్పుడు స్టైలిష్ హీరోయిన్‌గా మారింది.
"బంటీ, నీ సబ్బు స్లోనా ఏంటి?" అనే డైలాగ్‌తో ప్రాచుర్యం పొందిన లైఫ్ బాయ్ యాడ్ గుర్తుందా? అందులో కనిపించిన పాపే ఇప్పుడు బాలీవుడ్‌లో క్రేజీ ఫాలోయింగ్ ఉన్న హీరోయిన్ అవనీత్ కౌర్. చిన్నప్పుడే యాడ్స్, టీవీ షోలు, డ్యాన్స్ రియాలిటీ ప్రోగ్రామ్స్ వంటి వేదికలపై తన టాలెంట్‌ను చూపించిన ఆమె, ఇప్పుడు వెండితెరపై తన నటన, అందంతో కుర్రకారు హృదయాలను కొల్లగొడుతోంది.
లైఫ్‌బాయ్ యాడ్ తర్వాత అవనీత్ దాదాపు 40కు పైగా కమర్షియల్స్‌లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ‘డాన్స్ ఇండియా డాన్స్ లిటిల్ మాస్టర్స్’ ద్వారా దేశవ్యాప్తంగా తన డ్యాన్స్ స్కిల్స్‌ను పరిచయం చేసింది. టెలివిజన్ సీరియల్స్‌లోనూ నటించింది. కాగా 2014లో విడుదలైన ‘మర్దానీ’ సినిమాతో ఆమె బాలీవుడ్‌లో అడుగుపెట్టి ప్రశంసలు అందుకుంది. ఆ సినిమాతో మొదలైన ఆమె సినీ ప్రయాణం వెబ్ సిరీస్‌ల వరకు చేరింది.
‘బబ్బర్ కా తబ్బార్’, ‘బందిష్ బండిట్స్’ వంటి ప్రాజెక్ట్స్‌లో ఆమె నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఇటీవల విడుదలైన ‘టికూ వెడ్స్ షేరు’, ‘లవ్ కి అరేంజ్ మ్యారేజ్’ సినిమాలతో మంచి విజయాలను తన ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం 22 ఏళ్ల వయసున్న అవనీత్ కౌర్, సినిమాలకే కాదు సోషల్ మీడియాలోనూ తనదైన ప్రభావం చూపుతోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె షేర్ చేసే గ్లామర్ ఫొటోలు విపరీతంగా వైరల్ అవుతున్నాయి. కాగా ఈ బ్యూటీకి తాజాగా సౌత్ నుంచి ఒక ఆఫర్ వచ్చినట్లు వార్తలు వచ్చాయి. త్వరలోనే ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.