Nazriya Fahadh: విడాకుల బాటలో మరో సెలబ్రిటీ జంట..? సోషల్ మీడియా పోస్ట్ వైరల్..!
Nazriya Fahadh Divorce Rumours: సినీ సెలబ్రిటీలు అంటేనే ర్యూమర్స్‌కు పెట్టింది పేరు. అయితే తాజాగా నజీరియా నజీమ్ ఫాహాద్ ఫాజిల్ జంట కూడా త్వరలో విడాకులు తీసుకోబోతున్నారనే వార్త సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి.

Nazriya Fahadh: విడాకుల బాటలో మరో సెలబ్రిటీ జంట..? సోషల్ మీడియా పోస్ట్ వైరల్..!
Nazriya Fahadh Divorce Rumours: సోషల్ మీడియా వేదికగా ఫాహాద్ ఫాజిల్, నజీరియా త్వరలో విడాకులు తీసుకోబోతున్నారని వార్తలు వెల్లువెత్తుతున్నాయి. దీనికి నజీరియా పెట్టిన ఓ పోస్టు బలం చేకూరుస్తోంది. ఈ పోస్టు నిన్నటి నుంచి హల్‌చల్ చేస్తోంది. నెట్టింటా దీనిపై భిన్నంగా కామెంట్లు పెడుతున్నారు. సెలబ్రిటీలు అంటేనే బ్రేకప్, డైవర్స్ వంటి పుకార్లు వైరల్ అవుతూనే ఉంటాయి. కానీ నజీరియా నజీమ్ పెట్టిన పోస్ట్ మాత్రం పుష్ప విలన్ ఫాహాద్ ఫాజిల్‌తో విడాకులు తీసుకోబోతుందని వైరల్ అవుతోంది. వీరిద్దరూ 'బెంగళూరు డేస్' మూవీలో నటించే సమయంలో పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత ప్రేమగా మారి పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. ఇది ఇలా ఉండగా నజీరియా నజీమ్ 'రాజారాణి' సినిమా ద్వారా మంచి పేరును సంపాదించుకొని తెలుగు ప్రేక్షకులకు కూడా ఎంతో దగ్గర అయిపోయింది. ఆ తర్వాత ఇటీవల వచ్చిన 'సూక్ష్మ దర్శిని' సినిమా ద్వారా సూపర్ డూపర్ హిట్ కొట్టింది.
అయితే ఇద్దరు ఇలా సక్సెస్ బాటలో దూసుకుపోతున్న సమయంలో ఈ సెలబ్రిటీ జంట ఎందుకు విడాకులు తీసుకుబోతున్నారు అనే పుకార్లు మొదలయ్యాయి. అసలు నజ్రీయా SM లో 'నేను డిప్రెషన్ లోకి వెళ్ళాను. సూక్ష్మిదర్శిని సినిమా విజయాన్ని కూడా ఆస్వాదించలేకపోయా. ఇది నాకు చాలా కఠినమైన సమయం.. పూర్తిగా కోలుకున్న తర్వాత మళ్లీ మీ ముందుకు వస్తా' అంటూ రాసుకోచ్చింది. ఈ నేపథ్యంలో ఫాహాద్‌తో విడాకుల వల్లే తను ఇలా డిప్రెషన్ లోకి వెళ్లిందని నెట్టిజెన్లు భిన్నంగా స్పందిస్తున్నారు.
అంతేకాదు నజ్రీయా నజీం కొన్ని నెలలుగా ఎవరితోనూ కాంటాక్ట్ లోకి రావటం లేదంట. ఇలా సడన్ ఇన్‌స్టాగ్రామ్ పోస్టు పెట్టడంతో పర్సనల్ సమస్యల వల్లే తాను ఇలా డిప్రెషన్ లోకి వెళ్లిందని అనుకుంటున్నారు. విడాకుల వల్లే ఇలా జరిగి ఉండవచ్చని అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మరో స్టార్ జంట కూడా విడాకుల బాట పడుతోంది అని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి.