Malaika Arora: 50 ఏళ్ల వయస్సు ప్రేమలో పడ్డ బాలీవుడ్‌ హాట్‌ బ్యూటీ..? ఈసారి ఎవరితో తెలుసా?

Malaika Arora Dating Rumours: బాలీవుడ్‌లో స్టార్స్‌ డేటింగ్‌ కామన్‌. అయితే ఈ బ్యూటీ మాత్రం ఏకాంగా 50 ఏళ్ల వయస్సులో డేటింగ్‌ చేస్తోంది.

Update: 2025-04-02 06:20 GMT

Malaika Arora: 50 ఏళ్ల వయస్సు ప్రేమలో పడ్డ బాలీవుడ్‌ హాట్‌ బ్యూటీ..? ఈసారి ఎవరితో తెలుసా?

Malaika Arora Dating Rumours: బాలీవుడ్‌ హాట్‌ బ్యూటీ మలైకా అరోరా తన అందచందాలతో కుర్రాకారుకు సైతం చెమటలు పుట్టిస్తుంది. నెట్టింటా జిమ్‌ చేస్తోన్న వీడియోలు కూడా తన అభిమానులతో పంచుకుంటుంది. అయితే మొన్నటి వరకు తనకంటే పదేళ్లు చిన్నవాడు అయిన అర్జున్‌ కపూర్‌తో డేటింగ్‌ చేసిన సంగతి తెలిసిందే. ఆయన ఎవరో కాదు శ్రీదేవి భర్త, బాలీవుడ్‌ ప్రొడ్యూసర్‌ బోనీ కపూర్‌ మొదటి భార్య కొడుకు. ఇటీవల వారు విడిపోయినట్లు కూడా పుకార్లు వచ్చాయి. వాళ్లు ఎన్నో రోజులు డేటింగ్‌ చేశారు. కెమెరా ముందు కూడా లెక్కలేనన్నిసార్లు కూడా కంటపడ్డారు.

అయితే, తాజాగా అర్జున్‌ కపూర్‌తో బ్రేకప్‌ అయినట్లు వార్తలు బయటకు వచ్చాయి. అయితే, మొన్న ఆదివారం గువాహటీలో జరిగిన ఐపీఎల్‌ మ్యాచ్‌కు మలైకా అరోరాకు కూడా రాజస్థాన్‌ రాయల్స్‌ జెర్సీ ధరించి హల్‌చల్‌ చేసింది. చెన్నైతో ఆర్‌ఆర్‌ తలపడింది. అయితే, ఈ రాజస్థాన్‌ రాయల్స్‌కు డైరెక్టర్‌ కుమార్‌ సంగక్కరా ఆయన శ్రీలంకకు చెందిన ప్రముఖ క్రికెటర్‌ అని అందరికీ సుపరిచితమే.

అయితే, మళ్లీ ఈమె సంగక్కరాతో కనిపించడంతో వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నారనే వార్తలు బయటకు వస్తున్నాయి. దీంతో మలైకా అరోరా, కుమార్‌ సంగక్కరా కలిసి ఉన్న ఆ ఫోటోలు నెట్టింటా వైరల్‌ అవుతున్నాయి.

సోషల్‌ మీడియాలో వీరికి సంబంధించిన మీమ్స్‌ కూడా రెడీ అయిపోయాయి. నీకు ఆ ఫ్రాచైజీతో సంబంధం ఏంటి మేడం అని సోషల్‌ మీడియా వేధికగా ప్రశ్నలు సంధిస్తున్నారు.

ఇదిలా ఉండగా మలైకా మాత్రం ఆ వార్తలను ఖండించింది. 'ఏ ఇద్దరు పక్కపక్కన కూర్చుంటే మాత్రం వారు డేటింగ్‌ చేస్తున్నట్లవుతుందా? ఇలాంటి నిరాధారమైన పుకార్లను ఆపండి' అని సమాధానం చెప్పింది.

అయితే, అర్జున్‌ కపూర్‌ సింగమ్‌ ఏగైన్‌ ప్రమోషన్‌లో కూడా తన స్టేటస్‌ సింగిల్‌ అని కన్పామ్‌ కూడా చేశారు. ఈ నేపథ్యంలో మలైకా ఇలా సంగక్కరాతో కనిపించగానే వైరల్‌ అవుతోంది.


Tags:    

Similar News