Theater-OTT Releases: హాట్ సమ్మర్‌లో కూల్ కూల్ మూవీస్.. వినోదాల విందు ఖాయం..!
Theater-OTT Releases: సమ్మర్‌లో సినిమాలకు క్రేజ్ ఎక్కువగా ఉంటుందనే విషయం తెలిసిందే. కేవలం థియేటర్లలో మాత్రమే కాకుండా ఓటీటీలో కూడా కొన్ని చిత్రాలు సందడి చేసేందుకు సిద్ధమవుతున్నాయి.

Theater-OTT Releases: సమ్మర్‌లో సినిమాలకు క్రేజ్ ఎక్కువగా ఉంటుందనే విషయం తెలిసిందే. కేవలం థియేటర్లలో మాత్రమే కాకుండా ఓటీటీలో కూడా కొన్ని చిత్రాలు సందడి చేసేందుకు సిద్ధమవుతున్నాయి. మరి ఈ వారం ఓటీటీలో, థియేటర్లలో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్న సినిమాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
ఓదెల2:
తమన్నా లీడ్ రోల్‌లో నటించిన సినిమా ఓదెల2 ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమవుతోంది. ఏప్రిల్ 17వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఓదెల రైల్వే స్టేషన్ చిత్రానికి సీక్వెల్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. దుష్టశక్తుల నుంచి ఓదెల గ్రామాన్ని ఎలా రక్షించారన్న కథాంవంతో ఈ సినిమాను తెరకెక్కించారు.
అర్జున్ సన్నాఫ్ వైజయంతి:
నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా ప్రదీప్ చిలుకూరి తెరకెక్కించిన చిత్రం ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’. ఈ సినిమాలో విజయశాంతి చాలా రోజుల తర్వాత పవర్ ఫుల్ రోల్‌లో నటిస్తోంది. సయీ మంజ్రేకర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ ఇసినిమాలో సోహైల్ ఖాన్, శ్రీకాంత్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాను ఏప్రిల్ 18వ తేదీన విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నారు.
కేసరి చాప్టర్2:
బాలీవుడ్ నటుడు అక్షయ్‌కుమార్ లీడ్ రోల్‌లో నటించిన చిత్రం కేసరి చాప్టర్ 2 ఏప్రిల్ 18వ తేదీన ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమవుతోంది. 1919లో అమృత్‌సర్‌లో జరిగిన జలియన్ వాలా బాగ్ సంఘటన ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కంచారు.
ఓటీటీలో సందడి చేయనున్న సినిమాలు/సిరీస్‌లు:
* నెట్‌ఫ్లిక్స్‌లో ది గ్లాస్ డోమ్ (వెబ్‌సిరీస్)- ఏప్రిల్ 15వ తేదీ నుంచి, ఐ హోస్టేజి (మూవీ)- ఏప్రిల్ 18వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానున్నాయి.
* అమెజాన్ ప్రైమ్‌లో గాడ్‌ఫాదర్ ఆఫ్ హాలెం (వెబ్‌సిరీస్)- ఏప్రిల్ 13వ తేదీ నుంచి, ఖౌఫ్ (హిందీ సిరీస్) - ఏప్రిల్ 18వ తేదీ నుంచి అందుబాటులోకి రానుంది.
* జియో హాట్‌స్టార్ వేదికగా ది లాస్ట్ ఆఫ్ అజ్2 (వెబ్‌సిరీస్) - ఏప్రిల్ 14, ది స్టోలెన్ గర్ల్ (వెబ్‌సిరీస్) - ఏప్రిల్ 16వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానున్నాయి.
* సోనీలివ్‌లో చమక్: ది కన్‌క్లూజన్ (హిందీ సిరీస్)- ఏప్రిల్ 14వ తేదీ నుంచి అందుబాటులోకి రానుంది.