OTT Movie: ఆహాలో అదరగోడుతోన్న రొమాంటిక్, క్రైమ్ మూవీ.. సినిమా కథ ఏంటంటే?
OTT Movie: ప్రస్తుతం ఓటీటీ వేదికల్లో రొమాంటిక్ సినిమాలకే ఎక్కువ ఆదరణ లభిస్తోంది.

OTT Movie: ఆహాలో అదరగోడుతోన్న రొమాంటిక్, క్రైమ్ మూవీ.. సినిమా కథ ఏంటంటే?
OTT Movie: ప్రస్తుతం ఓటీటీ వేదికల్లో రొమాంటిక్ సినిమాలకే ఎక్కువ ఆదరణ లభిస్తోంది. దాంతో ఏ జానర్ సినిమా అయినా తప్పనిసరిగా రొమాంటిక్ సన్నివేశాలుంటేనే ప్రేక్షకులను ఆకర్షించగలమన్న అభిప్రాయంతో మేకర్స్ తమ కథలు రూపొందిస్తున్నారు. ముఖ్యంగా ఓటీటీలు అందుబాటులోకి వచ్చిన తర్వాత క్రైమ్, రొమాంటిక్ మూవీలకు ఆదరణ పెరుగుతోంది.
మరీ ముఖ్యంగా మలయాళ చిత్రాలు భారీ విజయాలు సాధిస్తున్నాయి. స్టార్ కాస్ట్ లేకపోయినా కంటెంట్తోనే ప్రేక్షకులను మెప్పిస్తున్నాయి. తాజాగా ఓ మలయాళ థ్రిల్లర్ యాక్షన్ మూవీ ‘అంచక్కల్లకోక్కన్’ ఓటీటీలో దూసుకుపోతోంది. ఈ సినిమా యాక్షన్ నేపథ్యంతో సాగినా అందులోని రొమాంటిక్ ఎలిమెంట్స్ సోషల్ మీడియాలో పెద్దగా హైలైట్ అవుతున్నాయి.
ప్రముఖ దర్శకుడు ఉల్లాస్ చంబన్ తెరకెక్కించిన ఈ చిత్రం గతేడాది థియేటర్లలో విడుదలై మంచి విజయాన్ని నమోదు చేసుకుంది. చిన్న సినిమాగా విడుదలై భారీ వసూళ్లు సాధించింది. ఇప్పుడు అదే సినిమా తెలుగులో ‘చాప్రా మర్డర్ కేసు’ పేరుతో ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.
కథ విషయానికి వస్తే.. కేరళ, కర్ణాటక సరిహద్దులోని ఓ గ్రామంలో భూస్వామి చాప్రా (శ్రీజిత్ రవి) హత్యకు గురవుతాడు. అదే సమయంలో వాసుదేవన్ (లుక్మన్ అవరన్) అనే కానిస్టేబుల్ ఆ స్టేషన్కు చేరుతాడు. అతను తన సీనియర్ నందవరంబన్ పీటర్ (చెంబన్ వినోద్ జోస్) సహాయంతో ఈ హత్యను ఛేదించేందుకు ప్రయత్నిస్తాడు. ఈ క్రమంలో భూస్వామి భార్య ఇంట్లో పని చేసే వ్యక్తితో ఎఫైర్ ఉన్నట్టుగా బయటపడటం మొదలైన అనేక ఊహించని మలుపులు కథను మరింత ఆసక్తికరంగా మార్చేస్తాయి. థ్రిల్లర్ టచ్తో పాటు రొమాన్స్ మిక్స్ చేసిన ఈ సినిమాకు ప్రస్తుతం ఓటీటీలో మంచి రెస్పాన్స్ వస్తోంది.