Chaurya Paatam: యూట్యూబ్ లో ట్రెండ్ అవుతోన్న చౌర్య పాఠం కొత్త సాంగ్.. 'ఒక్కసారిగా'కు ఫిదా అవుతోన్న ఆడియన్స్
దర్శకుడు త్రినాథరావు నక్కిన నిర్మాతగా మారి తెరకెక్కించిన చిత్రం చౌర్య పాఠం. క్రైమ్-కామెడీ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాతో యువ నటుడు ఇంద్రా రామ్ హీరోగా పరిచయం అవుతున్నారు.

దర్శకుడు త్రినాథరావు నక్కిన నిర్మాతగా మారి తెరకెక్కించిన చిత్రం చౌర్య పాఠం. క్రైమ్-కామెడీ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాతో యువ నటుడు ఇంద్రా రామ్ హీరోగా పరిచయం అవుతున్నారు. గతంలో ‘కార్తికేయ 2’ లాంటి చిత్రాలకు చందూ మొండేటి వద్ద అసోసియేట్ డైరెక్టర్‌గా పనిచేసిన నిఖిల్ గొల్లమారి ఈ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయమవుతున్నారు.
నక్కిన నెరేటివ్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ చిత్రానికి వి చూడమణి సహ నిర్మాత. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన టీజర్ చిత్రంపై అంచనాలను పెంచేసింది. క్రైమ్ థ్రిల్, డార్క్ హ్యూమర్ కలయికతో ఈ సినిమాను తెరకెక్కించారు. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో పాటను చిత్ర యూనిట్ విడుదల చేసింది. తాజాగా మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ లాంచ్ చేసిన “ఒక్కసారిగా” పాటకు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది.
ఈ పాటను దావ్‌జాండ్ లవ్లీ మెలోడీగా కంపోజ్ చేశారు. అనురాగ్ కులకర్ణి స్వరపరిచిన ఈ పాటలో కృష్ణ కాంత్ రాసిన లిరిక్స్ ఆకర్షణీయంగా ఉన్నాయి. కథానాయకుడు, కథానాయిక మధ్య కెమిస్ట్రీ ఈ పాటలో హైలైట్‌గా నిలిచింది. పాటకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. ప్రస్తుతం ఈ సాంగ్ యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతోంది.
ఇదిలా ఉంటే ఈ సినిమాలో పాయల్ రాధాకృష్ణ కథానాయికగా నటిస్తుండగా, రాజీవ్ కనకాల, మస్త్ అలీ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమా కథను ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కార్తీక్ ఘట్టమనేని రచించడం మరో విశేషం. దావ్‌జాండ్ సంగీతం అందించిన ఈ సినిమాకు ప్రొడక్షన్ డిజైనింగ్ బాధ్యతలను ‘హనుమాన్’ ఫేమ్ శ్రీ నాగేంద్ర తంగాల చేపట్టారు. ఎడిటింగ్‌ను ఉతుర నిర్వర్తిస్తున్నారు. సమ్మర్ కానుకగా ఏప్రిల్ 18వ తేదీన ప్రేక్షకుల ముందకు వచ్చేందుకు సిద్ధమవుతున్న ఈ సినిమా ప్రేక్షకులను ఏమేర ఆకట్టుకుంటుందో చూడాలి.