Allu Arjun: పవన్ కళ్యాణ్‌ను కలిసిన అల్లు అర్జున్.. ఎందుకంటే..?
Allu Arjun: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను ప్రముఖ సినీనటుడు అల్లు అర్జున్ సోమవారం హైదరాబాద్‌లో కలిశారు.

Allu Arjun: పవన్ కళ్యాణ్‌ను కలిసిన అల్లు అర్జున్.. ఎందుకంటే..?
Allu Arjun: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను ప్రముఖ సినీనటుడు అల్లు అర్జున్ సోమవారం హైదరాబాద్‌లో కలిశారు. ఇటీవల పవన్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ అగ్నిప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పవన్‌తో పాటు కుటుంబ సభ్యులను కలిసిన అల్లు అర్జున్.. బాలుడి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు.
ఇక ప్రమాదం నుంచి తన కుమారుడు సురక్షంగా బయటపడటంతో తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు పవన్ సతీమణి అన్నా లెజినోవా. స్వామి వారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. అలాగే తలనీలాలు కూడా సమర్పించుకున్నారు. రూ. 17లక్షలు అన్నప్రసాదాలు విరాళంగా ఇచ్చారు అన్నా.