Movies Releasing This Week: ఈ వారం వినోదాల విందు ఖాయం.. థియేట‌ర్‌, ఓటీటీలో ఇంట్రెస్టింగ్ మూవీస్..!

Movies Releasing This Week: ఒక‌ప్పుడు వీకెండ్ వ‌చ్చిందంటే కేవ‌లం థియేట‌ర్ల‌లో విడుద‌ల‌కు సిద్ధ‌మైన సినిమాల గురించే ఆలోచించే వారు.

Update: 2025-04-21 06:14 GMT
Upcoming Movies This Week Theatrical & OTT Releases from April 21 to 27 You Shouldnt Miss

Movies Releasing This Week: ఈ వారం వినోదాల విందు ఖాయం.. థియేట‌ర్‌, ఓటీటీలో ఇంట్రెస్టింగ్ మూవీస్..!

  • whatsapp icon

Movies Releasing This Week: ఒక‌ప్పుడు వీకెండ్ వ‌చ్చిందంటే కేవ‌లం థియేట‌ర్ల‌లో విడుద‌ల‌కు సిద్ధ‌మైన సినిమాల గురించే ఆలోచించే వారు. కానీ ప్ర‌స్తుతం ఓటీటీల విస్తృతి పెరిగిన నేప‌థ్యంలో ఓటీటీ ప్రాజెక్టుల‌పై కూడా ప్రేక్ష‌కులు ఆస‌క్తి చూపిస్తున్నారు. ఓటీటీ సంస్థ‌లు కూడా ప్ర‌తీ వారాంతం సినిమాల‌ను, వెబ్ సిరీస్‌ల‌ను తీసుకొస్తూ ఆడియ‌న్స్‌ను అట్రాక్ట్ చేస్తున్నాయి. ఈ క్ర‌మంలోనే తాజాగా ఈ వారం ఓటీటీ, థియేట‌ర్ల‌లో సంద‌డి చేసేందుకు సిద్ధ‌మ‌వుతోన్న కొన్ని ఇంట్రెస్టింగ్ మూవీఎస్‌, వెబ్ సిరీస్‌ల వివ‌రాలు ఇప్పుడు తెలుసుకుందాం..

ధియేట‌ర్ల‌లో సంద‌డి చేయ‌నున్న చిత్రాలు:

చౌర్య‌పాఠం:

ఈ వారం థియేట‌ర్ల‌లోకి వ‌స్తున్న చిత్రాల్లో చౌర్య పాఠం ఒక‌టి. ఏప్రిల్ 25న ఈ సినిమా ప్రేక్ష‌కుల‌ను అల‌రించేందుకు వ‌స్తోంది. ఒక అవ‌స‌రం కోసం దొంగ‌త‌నం చేయాల్సి వ‌స్తే, ఆ క్ర‌మంలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర‌య్యాయి లాంటి ఆస‌క్తిక‌ర‌మైన క‌థ‌నంతో ఈ సినిమా తెర‌కెక్కింది. నిఖిల్‌ గొల్లమారి తెరకెక్కించిన ఈ చిత్రాన్ని త్రినాథరావు నక్కిన నిర్మించ‌డం విశేషం.

సారంగ‌పాణి జాత‌కం: ప్రియదర్శి హీరోగా తెర‌కెక్కిన ‘సారంగపాణి జాతకం’ ఏప్రిల్ 25వ తేదీన ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. జాత‌కాలు ఇతివృత్తంగా ఈ సినిమాను తెర‌కెక్కించారు. తన నమ్మకాలు, తను ఇష్టపడిన అమ్మాయి ప్రేమ మధ్య కొట్టుమిట్టాడిన ఓ యువకుడి జీవితంలో ఎలాంటి సంఘ‌ట‌న‌లు ఎదుర‌య్యాయ‌న్న‌ది ఇందులో చూపించారు.

జింఖానా:

నస్లేన్ కె. గఫూర్ హీరోగా నటించిన ‘జింఖానా’ ఏప్రిల్‌ 25న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. బాక్సింగ్‌ నేపథ్యంలో కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెర‌కెక్కిన ఈ చిత్రంపై మంచి అంచ‌నాలే ఉన్నాయి.

గ్రౌండ్ జీరో:

ఇమ్రాన్‌ హష్మి, సాయి తమంకర్‌, జోయా హుస్సేన్‌, ముఖేశ్‌ తివారీ ప్ర‌ధాన పాత్ర‌లో తెర‌కెక్కిన గ్రౌండ్ జోరీ మూవీ ఈ నెల 25న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి తేజస్‌ ప్రభ విజయ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.

ఓటీటీలో సంద‌డి చేయ‌నున్న సినిమాలు:

* ది రిహార్సల్స్‌ (ఇంగ్లీష్‌) సీజన్‌-1 ఏప్రిల్‌21, స్టార్‌వార్స్‌: యాండిర్‌ (ఇంగ్లీష్‌) సీజన్‌1 ఏప్రిల్ 23, ఎల్‌2: ఎంపురాన్‌ (తెలుగు) ఏప్రిల్ 24 నుంచి జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది.

* నెట్‌ఫ్లిక్స్ వేదిక‌గా బుల్లెట్‌ ట్రైన్‌ ఎక్స్‌ప్లోజన్‌ (ఇంగ్లీష్‌) ఏప్రిల్ 23వ తేదీ నుంచి, ఏ ట్రాజడీ ఫోర్‌టోల్డ్‌ ఫ్లైట్‌ 3054 (ఇంగ్లీష్‌) ఏప్రిల్ 23వ తేదీ నుంచి, యు: ది కిల్లర్‌ ఫైనల్‌ (మూవీ) ఏప్రిల్ 24వ తేదీ నుంచి, వీక్‌ హీరో (ఇంగ్లీష్‌) ఏప్రిల్ 25వ తేదీ నుంచి, డిటెక్టివ్‌ కోనాన్‌ (యానిమేషన్‌) ఏప్రిల్ 25వ తేదీ నుంచి, హ్యావోక్‌ (ఇంగ్లీష్‌) ఏప్రిల్ 25 నుంచి, జ్యువెల్‌థీఫ్‌: ది హెయిస్ట్‌ బిగెన్స్‌ (హిందీ) ఏప్రిల్ 25 నుంచి అందుబాటులోకి రానుంది.

* ఇక జీ5లో అయ్యన మానే (మూవీ) ఏప్రిల్ 25 నుంచి అందుబాటులోకి రానుంది.

* షిర్డీ వాలే సాయిబాబా (మూవీ) ఏప్రిల్ 21 నుంచి సోనిలివ్‌లో స్ట్రీమింగ్ ప్రారంభం కానుంది.

Tags:    

Similar News